Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీ అంత చేసినా కూడా...!
By: Tupaki Desk | 13 Oct 2015 5:30 PM GMTరుద్రమదేవి విషయంలో వస్తున్న విమర్శలపై మెగా ఫ్యామిలీ మనసు నొచ్చుకొందా? పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. అన్నీ తామే అయ్యి ఆ సినిమాని గట్టెక్కిస్తే ఇప్పుడు మా సినిమాకే ఎసరు పెట్టేలా చేస్తారా అని మెగా ఫ్యామిలీ భాదపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన రుద్రమదేవిని ఎలాగైనా కొన్నాళ్లపాటు థియేటర్లలలో నిలబెట్టాలని, మరిన్ని వసూళ్లు రాబట్టుకోవాలని దర్శకనిర్మాత గుణశేఖర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో సినిమా అడ్డుగా రాకపోతే ప్రత్యామ్నాయం ఉండదనీ, అప్పుడు అందరూ రుద్రమదేవినే చూస్తారని గుణ ఆశపడుతున్నాడు. కానీ బ్రూస్ లీ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజునే విడుదల తేదీని ప్రకటించారు. అందుకే 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావల్సిందే అని వాళ్లు డిసైడైయ్యారు.
మెగా హీరో సినిమా కాబట్టి బ్రూస్ లీ వస్తే రుద్రమదేవికి ఒక్కసారిగా వసూళ్లు పడిపోతాయన్న బెంగ గుణశేఖర్ లో కనిపిస్తోంది. అయితే ఆయన మనసులో బ్రూస్ లీని వాయిదా వేయించాలన్న ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ... ఇండస్ట్రీలో ఆ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బాహుబలి విడుదలను పురస్కరించుకొని శ్రీమంతుడు సినిమాని వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు బ్రూస్ లీని కూడా వాయిదా వేయాల్సిందే అని వ్యాఖ్యానిస్తున్నారు. దాసరి ఇంట్లో ఇటీవల జరిగిన అభినందన సభలోనూ ఇదే రకమైన డిమాండ్లు వ్యక్తమయ్యాయి. పెద్ద సినిమాలు ఎప్పుడొస్తే అప్పుడే పండగ కాబట్టి, ఆ సినిమాని వాయిదా వేస్తే బాగుంటుందని దాసరి అభిప్రాయపడ్డారు. ఆ డిమాండ్ మెగా హీరోలని బాగా ఇబ్బంది పెడుతోంది. రుద్రమదేవి పలుమార్లు వాయిదా పడుతూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చిందని, మేం మాత్రం ఆర్నెళ్ల క్రితమే విడుదల తేదీ ప్రకటించాం కాబట్టి ఆ రోజునే విడుదల చేస్తున్నామని బ్రూస్ లీ టీమ్ చెబుతోంది. మెగా ఫ్యామిలీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
నిజానికి రుద్రమదేవికి అందరికంటే ఎక్కువ సపోర్ట్ గా నిలిచింది మెగా ఫ్యామిలీనే. గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఏ హీరోలూ ముందుకు రాలేదని అప్పట్లో చెప్పుకొన్నారు. కానీ అల్లు అర్జున్ నేను చేస్తానని ముందుకొచ్చి, అది కూడా పారితోషికం లేకుండానే చేసేశాడు. చిరంజీవిని కూడా ఒక్కసారి అడగ్గానే రుద్రమదేవికోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమా నిర్మాణంలోనూ అల్లు అరవింద్ తనవంతు సాయం చేశాడని తెలుస్తోంది. విడుదలయ్యాక కూడా అల్లు అర్జున్ పాత్రకే మంచి అప్లాజ్ వచ్చింది. సినిమాని నిలబెడుతోంది బన్నీ పాత్రే అని అంటున్నారు. మరి ఇంత చేసినా కూడా మళ్లీ మెగా ఫ్యామిలీనే విమర్శిస్తున్నారెందుకు? అని మెగా అభిమానులు, మెగా హీరోలు ఫీల్ అవుతున్నారట. గుణ దగ్గరుండి మరీ సినిమాని వాయిదా వేయించాలన్న డిమాండ్లు చేయించడంపై మెగా ఫామిలీ కినుక వహించినట్టు తెలిసింది.