Begin typing your search above and press return to search.
మెగా వర్గాలకు కోపాన్ని తెప్పించిన నరేశ్!
By: Tupaki Desk | 13 Oct 2021 4:30 AM GMTచిరంజీవి .. మొదటి నుంచి కూడా ఆయనకి సౌమ్యుడు అనే పేరు ఉంది. తనకి తాను ఒదిగిపోయి ఆయన కనిపిస్తుంటారు. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కొత్త సినిమాలను .. కొత్త టాలెంట్ ను ప్రశంసించడంలోనూ .. ప్రోత్సహించడంలోను ముందుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీని హీరోల పరంగా చిరంజీవి ఫ్యామిలీ అలుముకుంది. ఆ రకంగా కూడా మెగా ఫ్యామిలీనే అనిపించుకుంది. ఎవరు ఎలాంటి కష్టం వచ్చినా చిరంజీవి ఇంటి తలుపే తడుతున్నారు. దాసరి నారాయణ తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి అని చెప్పకుంటున్నారు.
కానీ దాసరి తరువాత ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ, ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయాలని సీనియర్ నరేశ్ అనడం ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. నరేశ్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఆయనకి ఎంతో సపోర్టు లభించింది. అప్పట్లో ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ తరువాత జీవిత - రాజశేఖర్ లు నరేశ్ ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసినప్పుడు, నరేశ్ పక్కన నిలబడుతూ ఆ సమస్యను పరిష్కరించడానికి చిరంజీవి నానా తంటాలు పడ్డారు.
అయితే పొందిన సాయాన్ని మరిచిపోయి నరేశ్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం మెగా వర్గాలకు .. ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇంతవరకూ ఎవరూ కూడా మెగా ఫ్యామిలీని నేరుగా టార్గెట్ చేసింది లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మంచు విష్ణు గెలిచిన తరువాత .. 'ఇప్పటివరకూ చీకట్లో ఉన్నవారు .. విష్ణు గెలుస్తాడని తెలిసిన తరువాత బయటికి వచ్చారని మనోజ్ మాట్లాడాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడనేది అందరికీ అర్థమైంది. తమకి చిరంజీవి ఫ్యామిలీతో ఎలాంటి స్పర్థలు లేవని చెబుతూ వచ్చిన విష్ణు, తనని తప్పుకోమని చెబుతూ తన తండ్రికి చిరంజీవి కాల్ చేసిన విషయాన్ని బయటపెట్టడం కూడా అలాంటిదే.
ప్రకాశ్ రాజ్ ప్లానింగ్ బావుంది .. ఈ సారికి ఆయనకి అవకాశం ఇచ్చి చూద్దాం అనే చిరంజీవి ఉద్దేశాన్ని నాగబాబు చెప్పారు. అందువల్లనే ఆయను సపోర్టు చేస్తున్నామని అన్నారు. అలా మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, నరేశ్ తన దూకుడును పెంచుతూ వెళ్లాడు. ఎక్కడ ఏ విషయంలోను ఆయన వెనక్కి తగ్గకుండా వెళ్లాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే, దాసరి నారాయణ రావు స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకి గల పూర్తి వ్యతిరేక భావానికి అద్దం పడుతుందని మెగా వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటే, నరేశ్ ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పట్ల వాళ్లంతా కూడా ఆయనపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.