Begin typing your search above and press return to search.
బెంగళూరు ఫామ్ హౌస్ లో కజురారే
By: Tupaki Desk | 10 Jan 2016 4:09 AM GMTమెగా ఫ్యామిలీ కజురారే సాంగేసుకుంటోంది. ఫ్యామిలీ సభ్యులంతా ఓ చోట ఏకమై పండగ మూడ్ లోకి వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నారు. గొబ్బెమ్మల పండగ(సంక్రాంతి)ని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పండగను హైదరాబాద్ లో కాకుండా, కాస్తంత డిఫరెంటుగా బెంగళూరు ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేయాలన్నది ప్లాన్. క్లీన్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న తోట ఆవరణలో, అతిధిగృహంలో అట్టహాసంగా ప్లాన్ చేశారు. అందుకే హీరోలంతా షూటింగులకు సెలవులు పెట్టి మరీ రెడీ అయిపోతున్నారు.
ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా ఫ్యామిలీ సమేతంగా ఓచోట కలుసుకుని ఉత్సవం జరుపుకోవడం మెగా కి అలవాటు. అందుకే ఈసారి కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ - అల్లు అరవింద్ ఫ్యామిలీ - నాగబాబు కుటుంబం - సాయిధరమ్ ఫ్యామిలీ అందరూ ఫామ్ హౌస్ లో కలుసుకుని సంబరాల్ని కన్నులపండువగా చేసుకోబోతున్నారు. ఇప్పటికే చరణ్ - చిరంజీవి కాంబినేషన్ లోని 150వ సినిమాని వాయిదా వేశారు. ఫిబ్రవరిలోనే ముహూర్తం అంటూ చెప్పేశారు.
అలాగే బన్ని - అల్లు శిరీష్ కూడా ఈ సెలవుల్లో షూటింగుల జోలికి వెళ్లరు. ఇక వరుణ్ తేజ్ - సాయిధరమ్ సైతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబంలో పిల్లా పీచు అంతా ఫామ్ హౌస్ లో సంబరాల కోసం ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి ప్రణాళిక. ప్రతియేటా కుటుంబ సమేతంగా ఒకసారి ఇలా కలుసుకుని సంబరాలు చేసుకుంటే కన్నులపండువగా ఉంటుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్ని ఉన్నా ఫ్యామిలీ ఒక్కటే కదండీ... అందుకే ఇలాంటి కజురారే వేడుక.