Begin typing your search above and press return to search.

క‌పూర్ ఫ్యామిలీలా టాలీవుడ్ కి మెగా ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   29 Jun 2021 7:30 AM GMT
క‌పూర్ ఫ్యామిలీలా టాలీవుడ్ కి మెగా ఫ్యామిలీ
X
డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌ర్.. యాక్ట‌ర్ కొడుకు యాక్ట‌ర్ .. ఇందులో త‌ప్పేం ఉంది. సినీరంగంలో పుట్టి పెరిగి ఇదేరంగానికి పెట్టుబ‌డులు పెడుతూ ప్ర‌తిభ‌ను సృష్టించి నిరంత‌రం అంకిత‌మై సేవ‌లు చేసే కుటుంబాల్ని ప‌రిశీలిస్తే అటు బాలీవుడ్ కి క‌పూర్ ఫ్యామిలీ ఎలానో ఇటు టాలీవుడ్ కి మెగా ఫ్యామిలీ అలా అంటూ విశ్లేషిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా బాలీవుడ్ లో న‌ట‌వార‌స‌త్వం పోక‌డ‌పై జ‌రిగినంత చ‌ర్చ టాలీవుడ్ లో ఉండదు. కొంద‌రు అక్క‌సు వెల్ల‌గ‌క్కినా కానీ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తే త‌ప్పేం కాద‌ని స‌మ‌ర్థించేవాళ్లే మ‌న‌కు ఎక్కువ‌.

భార‌తదేశ సినీ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేని రీతిన అతి పెద్ద హీరోల క్యాంప్ గా మెగా కాంపౌండ్ స‌ర్వీస్ చేస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి- నాగ‌బాబు- ప‌వ‌న్ కళ్యాణ్- అల్లు అర్జున్- రామ్ చ‌ర‌ణ్- వ‌రుణ్ తేజ్- సాయితేజ్- వైష్ణ‌వ్ తేజ్- శిరీష్- క‌ళ్యాణ్ దేవ్- విరాన్ ఇలా ప‌ద‌కొండు మంది హీరోలు ర‌న్నింగ్ లో ఉన్నారు. ప‌వ‌న్ వార‌సులు కూడా త్వ‌ర‌లోనే స్టార్లుగా రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు.

మిగ‌తా ఏ కాంపౌండ్ ల‌కు లేని స‌క్సెస్ రేట్ మెగా క్యాంప్ హీరోల‌కి ఉంది. ప‌ట్టుమ‌ని రెండు డ‌జ‌న్ల సినిమాలు తీస్తూ ఊపాధిని క‌ల్పిస్తూ ఇండ‌స్ట్రీని ర‌న్నింగ్ లో ఉంచుతున్న‌ది మెగా క్యాంపే. ఒకప్పుడు బాలీవుడ్ లో క‌పూర్స్ ఇండ‌స్ట్రీని ఏలిన‌ట్లుగా ఇప్పుడు మెగా హీరోలు తెలుగు చిత్ర సీమ‌ను ఏలుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.

ఒక్క మెగా ఫ్యామిలీలో ప్ర‌తి హీరో ఏడాదికి రెండు సినిమాలు క‌మిటైనా మొత్తం 22 సినిమాలు రిలీజ‌వుతాయి. ఒక్కో సినిమాకి 300-500 మంది ప‌ని చేసినా 22 సినిమాల‌కు ఎంత పెద్ద ఉపాధి ల‌భిస్తుందో గెస్ చేయొచ్చు. మెగా టీమ్ సొంత బ్యాన‌ర్ సినిమాల‌తో పాటు ఇత‌ర బ్యాన‌ర్ల‌కు సినిమాలు చేస్తూ అంద‌రినీ యాక్టివేట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.