Begin typing your search above and press return to search.
ఫ్యామిలి ఫ్యామిలీ అంతా గుళ్ల చుట్టూనే
By: Tupaki Desk | 19 Aug 2016 4:17 AM GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మరో మూడ్రోజుల్లో వస్తోంది.. అదే రోజున ఆయన 150వ సినిమా ఫస్ట్ లుక్ కూడా వస్తున్నట్లు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అటు సినిమాకి.. ఇటు పర్సనల్ గాను భగవంతుడి అనుగ్రహం కోసం మెగా ఫ్యామిలీ అంతా నడుం బిగించారు. పుణ్యక్షేత్రాలన్నీ చుట్టేస్తున్నారు. అంతా కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేస్తే ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో క్షేత్రాన్ని కవర్ చేసేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్ లోని స్కందగిరి ఆలయంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక పూజలు చేస్తే.. సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ అంతర్వేది వెళ్లి మరీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్య దేవాలయాన్ని సందర్శించి.. అక్కడ ప్రత్యేక రుద్రాభిషేకం చేశారు. అలాగే మెగాస్టార్ కోడలు ఉపాసన మంత్రాలయం వెళ్లి పూజలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ అంతా డివోషనల్ టర్న్ ఇచ్చుకున్నారనే సంగతి కనిపిస్తూనే ఉంది. అయితే సడన్ గా ఇలా పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తున్నట్లబ్బా?
ఒక్కసారిగా ఇలా దేవాలయాల చుట్టూ తిరగడం చూస్తుంటే.. అటు చిరంజీవికి.. ఇటు 150వ సినిమాకు అందరి అనుగ్రహాలు కోరుకుంటున్నారని చెప్పచ్చు. మెగా బర్త్ డేకి ఇంకా మూడ్రోజులు టైమ్ ఉంది కాబట్టి.. ఈలోగా మరిన్ని క్షేత్రాలను కవర్ చేసేయచ్చు మెగా ఫ్యామిలీ.