Begin typing your search above and press return to search.
#నిహారిక పెళ్లి.. స్టార్ వైవ్స్ డిజైనర్ లుక్ కాస్ట్ లీ గురూ
By: Tupaki Desk | 12 Dec 2020 6:13 AM GMTనిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ 5డే వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా రాజస్థాన్ లో రెండు రోజుల డెస్టినేషన్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి వేడుకలు ముగిసినా అభిమానుల్లో ఈ వేడుక గురించి ఇంకా హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ పెళ్లిలో స్టార్ కపుల్ డిజైనర్ లుక్ గురించి మగువలు స్టార్ వైవ్స్ ధరించిన ఖరీదైన చీరల గురించి ఆరాలు ఓ రేంజులోనే ఉన్నాయి.
నిహారిక ధరించిన పెళ్లి చీర ఖరీదు ఏకంగా 20లక్షలు వెచ్చించారని గుసగుసలు వినిపించగా.. ఈ పెళ్లి ఆద్యంతం ఎంతో డిజైనర్ లుక్ తో కాస్ట్ లీగా కనిపించిన బన్ని వైఫ్ స్నేహారెడ్డి .. చెర్రీ వైఫ్ ఉపాసన లుక్ గురించి చాలా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఖరీదైన చీరలు.. డిజైనర్ డ్రెస్ లు.. వాటికి కాంబినేషన్ గా కాస్ట్ లీ డైమండ్ నెక్లెస్ లతో వీరంతా పెళ్లి వేదికకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు.
పెళ్లి వెన్యూకి ప్రత్యేక విమానంలో వెళ్లేప్పుడు స్నేహ ధరించిన ఫ్రాక్ అనితా డోంగ్రే రూపొందించినది. దీని ఖరీదు రూ .12900 కాగా ఆమె జీన్ బ్యాగ్ డియోర్ బ్రాండ్ కి సుమారు రూ.2.5లక్షలు ఉంటుందని అంచనా. సంగీత్ లో స్నేహ దుస్తులను అమిత్ అగర్వాల్ రూపొందించారు. వీటి ఖరీదు 4.4 లక్షలు.
ఉపాసన రామ్ చరణ్ ప్రయాణంలో ధరించిన డ్రెస్ ఖరీదైనదే. ఆ రోజు ఉపాసన హీర్మేస్ హ్యాండ్ బ్యాగ్ ధరించగా.. దాని ధర రూ 11.8లక్షలు అని తెలిసి కళ్లు తేలేస్తున్నారు నెటిజనం. పెళ్లికి ఉపాసన దుస్తులను తరుణ్ తహిలియా - మనీష్ మల్హోత్రా రూపొందించారు. ఈ డిజైన్ల కోసమే లక్షల్లో చెల్లించారని అంచనా. అందాల కథానాయిక లావణ్య త్రిపాఠి కూడా ఖరీదైన లుక్ తో కనిపించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన బ్లూ చీరతో ఆమె అతిథుల దృష్టిని ఆకర్షించింది. ఈ చీర ఖరీదు సుమారు రూ. 1.4లక్షలు అని తెలిసింది. చిరు పెద్ద కుమార్తె సుష్మిత పోస్ట్ వెడ్డింగ్ పార్టీలో సభ్యసాచి పొందించిన చీరలో కనిపించారు. సుమారు దీని వెల.85 వేలు అని తెలిసింది.
ఇక పెళ్లి ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ డిజైనర్ లుక్ లో కనిపించగా ఆయన లుక్ ని కుమార్తెలే డిజైన్ చేశారట. చిరు చరణ్ ఎంతో డీసెంట్ గా కనిపించినా ఖరీదైన డ్రెస్సులను ప్రత్యేకించి డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన డిజైనర్ లుక్ కోసం లక్షల్లో వెచ్చించారట.