Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అభిమానిపై మెగాభిమాని ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 July 2023 9:25 AM GMT
ఎన్టీఆర్ అభిమానిపై మెగాభిమాని ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు
X
''ఒక హీరోని ప్రేమించడం అంటే మరో హీరోని ద్వేషించడం కాదు. ఫ్యాన్స్ అంటే చాలా స్పెషల్.. వారు తమ అపార‌మైన‌ ప్రేమను జీవితంలోని విలువైన సమయాన్ని హీరోల‌ కోసం వెచ్చిస్తారు'' అని అన్నారు టాలీవుడ్ నిర్మాత- పీఆర్వో ఎస్.కె.ఎన్. సామాజిక మాధ్య‌మాల్లో ఫేక్ ఐడీల‌తో హీరోల‌పై ద్వేషాన్ని పెంచి పోషించే వారి గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ద్వేషం స‌రికాద‌ని అన్నారు.

అంతేకాదు.. హార్డ్ కోర్ మెగాభిమాని అయిన ఎస్.కె.ఎన్ 'నంద‌మూరి ఫ్యాన్' సాయం గురించి ఒక అద్భుత‌మైన‌ ఉదాహరణను కూడా ఈ సంద‌ర్భంగా చెప్పారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ఎస్‌.కె.ఎన్ నిర్మించిన 'టాక్సీవాలా' 2018లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ముందు టాక్సీవాలా లీకుల వ్య‌వ‌హారం.. పైర‌సీ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో ర‌చ్చ‌కెక్కింది. జంగారెడ్డి గూడెంకు చెందిన జగదీష్ అనే సినీ ప్రేమికుడు త‌న‌కు ఫోన్ చేసి ఆ సినిమా పైరసీ వెర్షన్ పై సమాచారం అందజేసాడ‌ని అనంత‌రం సీడీల‌ షాపుపై రైడ్ చేశామ‌ని అత‌డు తెలిపారు.

జగదీష్ తనను తాను హార్డ్ కోర్ తారక్ అభిమానిగా పరిచయం చేసుకున్నాడు.. ఒక నంద‌మూరి అభిమానివి అయి ఉండి మెగాభిమానిని అయిన నాకు ఇలాంటి సాయం ఎలా చేస్తున్నావ్? అని ప్ర‌శ్నించ‌గా .. ఆ అభిమాని ''అదేంట‌న్నా..! మ‌న‌మంతా తెలుగు హీరోల అభిమానులం'' అంటూ మ‌న‌సు దోచుకున్నాడ‌ని ఎస్.కె.ఎన్ అన్నారు.

నేను తారక్ సినిమాల‌కు ప‌ని చేయ‌క‌పోయినా కానీ అత‌డు సాయం చేసాడు. అభిమానులంతా తెలుగు హీరోల‌కు అభిమానులే. అభిమానులందరూ సమిష్టిగా సినిమా ప్రేమికులు అని ఎస్.కె.ఎన్ పేర్కొన్నాడు. అభిమానులు అభిమానులకు సహాయం చేయాలి. నంద‌మూరి అభిమానిలో పరిపక్వత స్పష్టత నన్ను ఆశ్చర్యపరిచాయి అని అత‌డు చెప్పారు.

కొంద‌రు అనామక ఫేక్ ఫ్యాన్స్ మాత్ర‌మే సోషల్ మీడియాలో అభిమానుల మ‌ధ్య వార్ కి తెర లేపుతున్నార‌ని దీనిని అంత‌గా ప‌ట్టించుకోకూడ‌ద‌ని కూడా వ్యాఖ్యానించారు. ఎస్.కె.ఎన్ నిర్మించిన 'బేబి' ప్రచార కార్య‌క్ర‌మాల్లో ఈ ఆస‌క్తిక‌ర టాపిక్ పై ముచ్చ‌టించారు. తెలుగు అభిమానుల మధ్య తెలుగు హీరోల మధ్య విభ‌జ‌న ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న‌ అన్నారు.