Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్ కి అన్యాయం చేసిన అల్లు వారు
By: Tupaki Desk | 20 Oct 2022 4:51 AM GMTదసరా కానుకగా విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. సినిమా మంచి వసూళ్ల ను నమోదు చేసింది. ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. కానీ లాంగ్ రన్ లో ఆశించిన స్థాయిలో రాలేదు అనేది కొందరి అభిప్రాయం. అందుకు కాంతార సినిమా ఒక కారణం అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. అంతో ఇంతో ఇంకా ఆచార్య రాబడుతున్న సమయంలో కాంతార వచ్చింది.
కాంతార సినిమా సినిమాను తెలుగు లో రిలీజ్ చేసిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమాను పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంతార వచ్చి ఉండకుంటే గాడ్ ఫాదర్ సినిమా మరో వారం లేదా రెండు వారాల పాటు సందడి చేసేది... మరి కొన్ని కోట్ల వసూళ్లను రాబట్టేది అనేది వారి యొక్క అభిప్రాయం.
గాడ్ ఫాదర్ సినిమా సొంతంగా రిలీజ్ చేయడంతో త్వరగానే లాభాలు వచ్చాయంటూ నిర్మాత లు చెబుతున్నారు. అయినా కూడా కాంతార సినిమా విడుదల విషయంలో అల్లు అరవింద్ మళ్లీ ఆలోచించి ఉండాల్సిందని మెగా అభిమానులు మరియు గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సభ్యులు అసహనంతో ఉన్నారు.
కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతార ను వెంటనే డబ్ చేసి రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ పట్టుబట్టి మరీ విడుదల చేశారు. సినిమా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే డబ్ చేసి విడుదల చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించాడు.
ఆయనకు బాగానే ప్రయోజనం కలిగింది.. ఇంకా కలుగుతూనే ఉంది. కానీ గాడ్ ఫాదర్ సినిమా కు ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా అన్యాయం జరిగిందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరో వారం లేదా రెండు వారాల పాటు గాడ్ ఫాదర్ సినిమా మినిమంగా అయినా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కానీ అల్లు వారు అన్యాయం చేశారు అనేది కొందరి వాదన.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.