Begin typing your search above and press return to search.

కాజల్ పై మెగా ఫాన్స్ గుస్సా

By:  Tupaki Desk   |   14 March 2023 4:00 PM GMT
కాజల్ పై మెగా ఫాన్స్ గుస్సా
X
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన నేపధ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ తెచ్చుకొని చరిత్ర సృష్టించింది అంటూ పొగిడేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవడంపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే ఆమె ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. మరో ట్వీట్ లో కూడా నాటు నాటు పాటకి అవార్డు రావడంపై ప్రశంసలు కురిపించింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తాను పెట్టిన ట్వీట్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేయకుండా ప్లెయిన్ టెక్స్ట్ తో మెసేజ్ పెట్టింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా అని చెప్పాలి.

ఆ సినిమా ఒక్కసారిగా కాజల్ అగర్వాల్ ఇమేజ్ ని పెంచేసింది. ఆ సినిమాలో కాజల్ కి జోడీగా రామ్ చరణ్ నటించాడు. ఇక ఆ మూవీకి సంగీతం అందించింది ఎంఎం కీరవాణి అనే సంగతి అందరికి తెలిసిందే. ఇలా తన సక్సెస్ లో కీలకంగా మారిన వ్యక్తులని ట్యాగ్ చేయకుండా ట్వీట్ చేయడంపై మెగా అభిమానులతో పాటు జక్కన్న అభిమానుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కి కృతజ్ఞత లేదని కనీసం తనకి సక్సెస్ ఇచ్చిన వారిని గుర్తుచేసుకునే సంస్కారం కూడా లేదని ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఆమెని అర్జెంట్ గా టాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసి ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. అయితే తరువాత ఆమె చేసిన సీన్స్ అన్ని కూడా తొలగించారు. ఈ కారణంగానే కాజల్ అగర్వాల్ హర్ట్ అయ్యి రామ్ చరణ్ పేరుని ట్యాగ్ చేసి ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.