Begin typing your search above and press return to search.
బన్నీ గురించి ఏం చెప్పినా గొడవే
By: Tupaki Desk | 14 July 2017 4:25 PM GMTపాపం.. అల్లు అర్జున్ పరిస్థితి తలుచుకుంటే ఇలా అనుకోకుండా ఉండలేం. మెగాస్టార్ మీద ఉన్న విపరీతమైన అభిమానం కొద్దీ.. ఆయన మాట్లాడుతుంటే కూడా 'పవర్ స్టార్' నినాదాలను హోరెత్తించేశారు అనే పాయింట్ ను మనసులో పెట్టేసుకుని.. తనకు టైం వచ్చినపుడు 'చెప్పను బ్రదర్' అనేశాడు. తీరా అది జనాల్లోకి వెళ్లేసరికి వేరేగా టర్న్ తీసుకుని బన్నీ టార్గెట్ అయిపోయాడు.
డీజే ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేందుకు గాను.. ఆయన్ను ఎవరూ అనుకరించలేరని.. తాను కూడా ఆయన్ను గుర్తు చేస్తానే తప్ప ఇమిటేట్ చేయను అని చెబితే.. రామ్ చరణ్ చేస్తున్నాడు కాబట్టి.. చెర్రీని వెక్కిరిస్తున్నాడనే టర్న్ తీసుకుంది. డీజే కు డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు కలెక్షన్స్ లెక్కలు చెబితే.. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 కంటే ఎక్కువా అని ఆడేసుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు మరో కొత్త గొడవ మొదలైపోయింది. ఈసారి బన్నీ నోరు తెరవకపోయినా.. టార్గెట్ మాత్రం బన్నీనే కావడం విచిత్రమే.
హీరో నుంచి విలన్ గా టర్న్ తీసుకున్న జగపతి బాబును.. 'మీ ఫేవరెట్ స్టార్ ఎవరు' అని అడిగితే.. తడుముకోకుండా అల్లు అర్జున్ అని చెప్పడంతో పాటు.. 'మెగా హీరో' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించుకోకుండా ఎదుగుతున్నాడని అన్నాడు. దీంతో బన్నీకి సంబంధం లేకపోయినా.. మెగా ఫ్యాన్స్ తో మాటలు మాత్రం తనకే వస్తున్నాయి. అసలు మెగాస్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా బన్నీ ఈ స్థాయికి వచ్చేవాడా అన్నది అభిమానుల ప్రశ్న. ఇందులో వాస్తవం లేకపోలేదు కానీ.. మరీ బన్నీ గురించి ఏం చెప్పినా గొడవే అంటే మాత్రం క్లిష్టమైన విషయమే.