Begin typing your search above and press return to search.

ఆర్‌సీ15 విషయంలో మెగా ఫ్యాన్స్ డబుల్‌ హ్యాపీ

By:  Tupaki Desk   |   14 April 2022 11:00 AM IST
ఆర్‌సీ15 విషయంలో మెగా ఫ్యాన్స్ డబుల్‌ హ్యాపీ
X
రాజమౌళి తర్వాత సౌత్‌ లో దిగ్గజ దర్శకుడు అంటే ఖచ్చితంగా శంకర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అద్బుతమైన సినిమాలను తెరకెక్కించి తనదైన మార్క్ ను ఏర్పర్చిన దర్శకుడు శంకర్ భారీ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో ఒక సినిమాను చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ సినిమా అంటూ మెగా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

సాదారణంగా అయితే శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే చాలా ఆలస్యం అవుతుంది. ఒకటికి రెండేళ్ల సమయం ను ఆయన తీసుకుంటాడు. రాజమౌళి తరహాలోనే శంకర్ కూడా చరణ్ సినిమాను చాలా ఆలస్యం చేసే అవకాశం ఉందని.. ఖచ్చితంగా రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా శంకర్‌ చాలా స్పీడ్ గా ఉన్నాడు.

బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఆంద్ర ప్రదేశ్‌ లోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు కీలక షెడ్యూల్‌ ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా సగానికి పైగా పూర్తి అయ్యిందట. సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆ రెండు పాత్రలకు సంబంధించిన షూటింగ్ చకచక జరుగుతుందని తెలుస్తోంది.

శంకర్ సినిమా రెండు మూడు సంవత్సరాలు పడుతుందని అనుకున్న అభిమానులకు ఇదే ఏడాదిలో అది కూడా మరో మూడు నాలుగు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో చరణ్ సినిమా కు ఫుల్‌ హ్యాపీగా ఉన్న అభిమానులు ఇప్పుడు శంకర్ చాలా స్పీడ్‌ గా సినిమాను ముగిస్తున్న నేపథ్యంలో మరింత హ్యాపీగా ఉన్నారు.

మెగా అభిమానుల డబుల్‌ హ్యాపీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్‌ సీ 15 సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని శంకర్‌ మరియు దిల్‌ రాజు లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో అంజలి కనిపించబోతుంది.

సునీల్‌ ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు నటించారు. సినిమా లో చరణ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు డబుల్‌ ఉన్నాయి.