Begin typing your search above and press return to search.
ఆ తండ్రి కొడుకులకు మెగా ఫ్యాన్స్ కృతజ్ఞతలు
By: Tupaki Desk | 6 Oct 2022 9:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో డిజాస్టర్ ను మూట కట్టుకున్న సమయంలో మెగా ఫ్యాన్స్ లో కొంత మంది మరియు యాంటీ మెగా ఫ్యాన్స్ చిరంజీవి పనైపోయింది అనే కామెంట్స్ చేశారు. కానీ ఆయన స్థాయి ఏంటో గాడ్ ఫాదర్ సినిమా తో మళ్లీ నిరూపించారు. సౌత్ ఇండియన్ స్టార్స్ లో తాను టాప్ అంటూ మరోసారి గాడ్ ఫాదర్ మొదటి రోజు వసూళ్లతో చిరంజీవి నిరూపించారు.
గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు దాదాపుగా 38 కోట్ల వసూళ్లను నమోదు చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిరంజీవి నుండి ఒక మంచి సాలిడ్ సినిమా రావాలే కానీ వసూళ్లు కుమ్మేస్తుందని ఈ వసూళ్లను చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఈ సమయంలో గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాకి ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు.
చిరంజీవి గతంలో ఒక సారి వరుస ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో హిట్లర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సమయంలో చిరంజీవి మళ్లీ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగే విధంగా సక్సెస్ అయ్యాడు. హిట్లర్ సినిమా సక్సెస్ అవ్వకుంటే కచ్చితంగా పరిస్థితి వేరే ఉండేది అంటూ అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ఫెయిల్ అయ్యి ఉంటే కూడా తప్పకుండా చిరంజీవి కెరీర్ విషయంలో ఆలోచనలో పడేవారు అనడంలో సందేహం లేదు. అలాంటి సమయంలో గాడ్ ఫాదర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల ఇప్పుడు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
హిట్లర్ సినిమాకు ఎడిటర్ మోహన్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు గాడ్ ఫాదర్ కి దర్శకత్వం వహించింది ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ లే. దాంతో ఈ రెండు సినిమాల దర్శకులు అయిన తండ్రి కొడుకులకు మెగా ఫ్యాన్స్ రుణపడి ఉన్నాం అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.