Begin typing your search above and press return to search.
మణి సర్ సరే.. చిరుతో ఏంటి నామోషీ?
By: Tupaki Desk | 26 Sep 2018 5:42 AM GMTసరిగ్గా ఆర్నెళ్ల ముందు `సైరా-నరసింహారెడ్డి` చిత్రీకరణ ప్రారంభం కాకముందు ఓ హై హైడ్రామా గురించి మెగాభిమానులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. `సైరా` చిత్రానికి సంగీత దర్శకుడిగా స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంతకం చేశారన్న వార్తతో మెగాభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఆస్కార్ రేంజ్ సంగీత దర్శకుడు చిరంజీవి టీమ్ లో పని చేస్తున్నారన్న ఉత్సాహం - ఉత్కంఠ కనిపించింది. రెహమాన్ తెలుగు ఆల్బమ్ విని చాలాకాలమైందని ఆడియెన్ అంతే ఉత్కంఠ ఫీలయ్యారు. కట్ చేస్తే నేను ఈ సినిమాకి పని చేయడం లేదంటూ రెహమాన్ నుంచి బ్యాడ్ న్యూస్. సాంకేతిక కారణాల వల్ల కుదరలేదంటూ కొణిదెల ప్రొడక్షన్స్ టీమ్ ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు? ఎగ్జిస్ట్ కాలేకపోయారా? అంటూ చాలానే మాట్లాడుకున్నారు. తాను పోసిన మూసలోకి ఇతరులు రావాలనుకునే తత్వం రెహమాన్ ది. ఆయనకు అన్నీ అనుకూలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఓ సినిమాకి ఓకే చెబుతారు. అయితే సైరా టీమ్ తో ఏం కుదరలేదో ఆయన మాత్రం ఇంత భారీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచారు. రెహమాన్ చెయ్యేస్తే `సైరా` బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆస్కార్ రేంజులో - హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని భావించిన వారికి అతిపెద్ద నిరాశే ఎదురైంది.
అదంతా గతం.. వర్తమానంలోకి వస్తే నిన్నటి రోజున హైదరాబాద్ పార్క్ హయత్ లో `నవాబ్` ప్రమోషన్స్ లో పాల్గొన్న రెహమాన్ మాట తీరు అంతే పెద్ద షాకిచ్చింది. తన గురువు మణిరత్నం కోసం ఎంతయినా వేచి చూస్తానని - తనకు మాత్రం ఎంత సమయం అయినా కేటాయిస్తానని అన్నారు. పనిలో పనిగా తెలుగు భాషను ఆకాశానికెత్తేసిన రెహమాన్.. తెలుగు సొంపుగా ఉంటుందని కితాబిచ్చేశారు. రెహమాన్ మాట్లాడుతూ- ``తెలుగులో మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా సొంపుగా ఉంది. వినేకొద్దీ వినాలనిపిస్తోంది. చాలా మంచి భాష ఇది. నా గురువుగారు మణిరత్నంతో కలిసి పనిచేసేటప్పుడు పనిలా అనిపించదు. మేమిద్దరం కూర్చుంటే టైమ్ గురించి పట్టించుకోను. అమెరికా ట్రిప్ లో ఉండగా ఓ రూమ్ తీసుకుని అక్కడ ఎక్విప్ మెంట్ ను అమర్చుకుని - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. మణి నన్ను నమ్మారు.. కావాలంటే అమెరికాకు అసిస్టెంట్ ని పంపిస్తానని చెప్పారు. కాదు.. నేను పని చేస్తున్నానని అక్కడ వీడియో తీసి చూపించేవాడిని. అంతగా ఆయన నమ్మారు`` అనీ తనదైన శైలిలో నవాబ్ వర్కింగ్ స్టైల్ ని చెప్పారు.
ఆ క్షణం రెహమాన్ మాటలు విన్నవారికి ఒక సంగతి అర్థమైంది. గురువు కోసం అంత అభిమానంగా పని చేస్తారు కానీ, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన మెగాస్టార్ `సైరా` కోసం అస్సలు వేచి చూడలేకపోయారు! అంటూ ఆ క్షణం అక్కడ ఉన్న మెగాభిమానులంతా కాస్త ఎమోషనల్ గానే ఫీలయ్యారు. ఎంతయినా గురువు గారు కదా.. ఆ మాత్రం అభిమానం ఉంటే తప్పేం కాదు. అలాగని ఎంత పెద్ద స్టార్లయినా లెక్కచేయరేంటో! అనీ తెగ ఫీలయ్యారు. ఏ.ఆర్.రెహమాన్ `సైరా` నుంచి తప్పుకున్న తర్వాత మరో ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని నిర్మాత రామ్ చరణ్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.