Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ కి కూడా ఎందుకు నచ్చలేదంటే
By: Tupaki Desk | 17 Oct 2015 5:44 AM GMTదసరా పండక్కి సెలవల సీజన్ లో రావడంతో రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రానికి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. కానీ ప్రేక్షకులనే కాదు.. ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారనే విషయం అర్ధమైపోయింది. ఎంతగా కవర్ చేద్దామన్నా.. జనాల డిప్రెషన్ ని రికవర్ చేయడం కష్టం. అసలు చిరంజీవి కేమియో తప్ప సినిమాలో ఏముందో అర్ధం కాని పరిస్థితి అభిమానులది. సాధారణంగా రాంగోపాల్ వర్మని తిట్టుకునే ఫ్యాన్స్ కూడా.. ఈ మూవీకి బ్రూస్ లీ అనే టైటిల్ ఎందుకు పెట్టారనే వర్మ ప్రశ్నను సమర్ధిస్తున్నారు. చెర్రీకి సేఫ్ జోన్ ఫైట్స్ - డ్యాన్సులు. యాజ్ యూజువల్ గానే చరణ్ స్టెప్పులు ఉతికి ఆరేశాడు.
ఎప్పుడూ విమర్శలపాలయ్యే తమన్ ఇచ్చిన మ్యూజిక్.. బ్రూస్ లీకి మాత్రం మాంచి కిక్ ఇచ్చింది. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ - రామ్ చరణ్ - చిరంజీవి తప్ప మూవీలో ఏమీ కనిపించడం లేదు. కుప్పలు తెప్పలుగా కేరక్టర్ ఆర్టిస్టులను పెట్టేయడం - మైండ్ లో రిజిస్టర్ అయ్యే లోపే.. పేజీలుపేజీలు డైలాగులు చెప్పించడం.. అదో డిఫరెంట్ స్టయిల్ అనుకుంటున్నాడేమో శ్రీను వైట్ల. టాలీవుడ్ లో ఉన్న కొత్త, పాత కమెడియన్లలో మూడొంతుల మంది బ్రూస్ లీలో దర్శనమిస్తారు. కానీ ఒక్కళ్లకి చెప్పుకోదగ్గ డైలాగ్ ఒక్కటి కూడా లేదు.
ఇక వైట్ల సినిమాల్లో రెచ్చిపోయే బ్రహ్మీ పరిస్థితి మరీ దారుణం. ఓ పాతిక ముప్ఫై పేర్లు - కేరక్టర్ వేరియషన్స్ చెప్పేస్తారు. కొట్టడం తప్ప కనిపించేది ఏమీ లేకపోయింది. చివరకు స్టోరీలో కూడా హీరో కేరక్టర్ ఎలివేషన్ లేదు. ఫస్టాఫ్ అంతా అక్క చుట్టూ తిరిగితే.. సెకండాఫ్ లో అక్కకి అత్తగారైన నదియా చుట్టూ తిప్పేశారు. మెగాస్టార్ ని చూసి ముచ్చట పడాల్సిందే తప్ప.. రామ్ చరణ్ ను చూసి సంబరపడే ఛాన్స్ ఒక్క సీన్ లో ఇవ్వలేదు. చివరకు ఫ్యాన్స్ ని కూడా ఏ మాత్రం అలరించలేకపోయాడు బ్రూస్ లీ. రచ్చ లాంటి యావరేజ్ కంటెంట్ మూవీని కూడా తన భుజాలపై మోసేసి హిట్ కొట్టేయగల స్టామినా, ఫాలోయింగ్ రామ్ చరణ్ సొంతం. కనీసం ఆ బేసిక్ పాయింట్ ని మర్చిపోయాడు శ్రీనువైట్ల.
ఇరిటేషన్ - ఇమిటేషన్ అంటూ ప్రాసలతో డైలాగ్స్ మాత్రం బోలెడున్నాయి. అలాగని తన సినిమాలను తనే ఇమిటేషన్ చేస్తే.. అభిమానులకు కూడా ఇరిటేషన్ వస్తుంది. కథలో కంటెంట్ ఉండదు కానీ.. క్లైమాక్స్ మాత్రం బ్రహ్మాండంగా రావాలనే డైలాగ్ ని ఏ ధైర్యంతో పెట్టాడో వైట్లకే తెలియాలి. అలాంటి పంచ్ వేసిన సినిమా.. అదే రకంగా ఉండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.