Begin typing your search above and press return to search.

సర్దార్ వేడుకపై ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్

By:  Tupaki Desk   |   20 March 2016 12:11 PM GMT
సర్దార్ వేడుకపై ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్
X
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంఛింగ్ కి మరి కొన్ని గంటల సమయమే ఉంది. ఈ మధ్య కాలంలో మెగా ఈవెంట్లు చాలానే జరిగినా.. అన్నిటిలోకి ఇదే హైలైట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాకాలం తర్వాత ఒక వేదికపై కనిపించనుండడమే దీనికి కారణం. మరి ఈ వేడుకలో వాళ్లు ఏం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు?

సర్దార్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి సెట్స్ కి వెళ్లి, మాట్లాడుకున్నారు. అప్పుడు వారిద్దరి ఏం మాట్లాడుకున్నారనే సంగతులు.. ఇవాళ తెలిసే ఛాన్సులు ఉన్నాయి. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ హీరోగా పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం తప్పనిసరి. మరి ఆయనే మాట్లాడతారు.. అన్నయ్యతో అనుబంధాన్ని వివరిస్తారా.. పాలిటిక్స్ పై పెదవి విప్పుతారా.. గత కొన్ని మెగా ఫంక్షన్స్ కు ఎందుకు అటెండ్ అవలేదో చెప్తారా.. మెగా బ్రదర్స్ మధ్య విబేధాల గురించి మాట్లాడతారా.. అన్నీ క్వశ్చన్సే.. ఆన్సర్స్ పవన్ మాత్రమే ఇవ్వగలడు.

నెక్ట్స్.. చీఫ్ గెస్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ ఇండస్ట్రీలో ఉన్న స్థాయి, పాలిటిక్స్ లో ప్రత్యర్ధిగా ఉండడం వంటి వాటిపై మాట్లాడాల్సి వస్తుంది. వీటన్నిటికీ మించి అభిమానల్లో ఉత్సాహం నింపుతూ మాట్లాడ్డంలో చిరు తర్వాతే ఎవరైనా.

ఇక సినిమా ఎలా ఉండనుంది.. గట్స్ - గన్స్ అండ్ లవ్ అనే ట్యాగ్ లైన్ కి అర్ధమేంటో కూడా ఇక్కడే తేలాలి. మరోవైపు ఈ మూవీ మ్యూజిక్ కోసం విపరతీంగా శ్రమించి, పవన్ తో పాడించిన దేవిశ్రీ ప్రసాద్ ఏం చెబ్తాడనే అంశపై కూడా బోలెడంత ఆసక్తి ఉంది. వీటన్నిటికి సమాధానం మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది.