Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ కి గాయం.. ఆరా తీసిన మెగా ఫ్యాన్స్!
By: Tupaki Desk | 8 Aug 2021 1:35 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకున్న యూనిట్ కొన్ని పాటల చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లింది. అయితే అవసరం మేర కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ఆ విషయం పక్కనబెడితే తారక్-చరణ్- రాజమౌళి షూటింగ్ గ్యాప్ లో గేమ్స్ ఆడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ను కూడా ఆర్.ఆర్.ఆర్ టీమ్ రిలీజ్ చేసింది. అందులో తారక్ ముఖానికి ఎడమవైపు తలకి దగ్గరల్లో చిన్న గాయం అయినట్లు కనిపిస్తోంది.
దీంతో యంగ్ టైగర్ అభిమానులు కంగారు పడ్డారు. ఆ దెబ్బ ఏంటని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. చరణ్ సహా మెగా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా గాయం గురించి అడిగారు. దీంతో యూనిట్ అది కేవలం మేకప్ మాత్రమేనని ఎలాంటి గాయం కాలేదని వివరణ ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. అక్కడే ఎందుకు అంతగా ఉబ్బినట్లు కనిపిస్తోంది. ముఖమంతా బాగానే ఉంది. కానీ ఆ భాగంలోనే ఏదో గాయం అయినట్లు కనిపిస్తోంది. మరి అభిమానులు కంగారు పడతారని మేకప్ వేశామంటూ కవర్ చేసారా? లేక ! నిజంగా మేకప్ వేసారా? అన్నది కొన్ని రోజులుగా ఆగితే గానీ క్లారిటీ రాదు.
కారణం ఏదైనా జూనియర్ అభిమానులు యూనిట్ వివరణ తో రిలాక్స్ అయ్యారు. ఒక వేళ గాయం అయినా అది చాలా చిన్నదిగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్.ఆర్.ఆర్ కారణంగా చరణ్ -తారక్ అభిమానులు ఒకటై ప్రచారం చేస్తున్నారు. ఒక సినిమా ఇద్దరి హీరోల అభిమానుల్ని కలిపిందని తారక్ గాయం మరోమారు ప్రూవ్ చేసింది. అంతగా మెగాభిమానులు ఆ గాయం గురించి ఆరాలు తీసారు మరి. ఇక షూటింగ్ ప్రారంభం నుంచి తారక్ కి .. చరణ్ కి ఏవో అవాంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. గాయాలు ఒకవైపు కరోనా మరోవైపు వెంటాడాయి.