Begin typing your search above and press return to search.
నాని మీద మెగా ఫ్యాన్స్ గుస్సా
By: Tupaki Desk | 25 Feb 2019 4:04 AM GMTనిన్న నాని 24కి గ్యాంగ్ లీడర్ అని టైటిల్ ఫిక్స్ చేయడం ఆలస్యం ట్విట్టర్-ఫేస్ బుక్ వేదికగా మెగాభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.చిరంజీవి కెరీర్ లోనే చాలా స్పెషల్ మూవీగా ఫాన్స్ పరిగణించే గ్యాంగ్ లీడర్ ని అలా ఎలా పెట్టేసుకుంటారని నిలదీస్తూ పేరు కనక మార్చకపోతే బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. మెగా హీరోలు వాడుకుంటేనే ఆలోచిస్తామని అలాంటిది బయటివాళ్ళు పెట్టుకోవడం ఏంటని మైత్రి బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ మెసేజులు పంపిస్తున్నారు. ఇది నాని టీమ్ టైటిల్ అనౌన్స్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడం గమనార్హం.
నిజానికి గ్యాంగ్ లీడర్ టైటిల్ తో పలుమార్లు రామ్ చరణ్ తో సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు. నలుగురు అన్నయ్యలు ఉన్న కథ కాబట్టి ఒకదశలో వినయ విధేయ రామకు ఇదే పేరు పెట్టొచ్చని ప్రచారం జరిగింది. అయితే కథకు సూట్ అవ్వకపోవడంతో పాటు రామ్ చరణ్ పర్సనల్ గా నో చెప్పడంతో ఆ ఆలోచన మానుకున్నారు. గ్యాంగ్ లీడర్ టైటిల్ కు అంత ప్రత్యేకత ఉంది కాబట్టే ఇన్నేళ్లలో ఎవరూ వాడుకునే సాహసం చేయలేకపోయారు.
ఇప్పుడు నాని ఈజీగా పెట్టేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ నుంచి నిరసన వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా టైటిల్ ని మార్చమని లేదంటే తమనుంచి బాయ్ కాట్ ఎదురుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది ఊహించని పరిణామమే. మద్దతు దక్కుతుంది అనుకుంటే రివర్స్ లో ఇలా అపోజ్ చేయటం టీమ్ ని షాక్ కు గురి చేస్తోంది. మరి నాని దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ టైటిల్ వాడుకోవడం గురించి ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి. దీన్ని ట్రెండ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ సన్నద్ధం కావడం గమనార్హం. స్వతహాగా తానే చిరు అభిమానినని చెప్పుకొనే నాని రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.