Begin typing your search above and press return to search.
దేవిశ్రీ ప్రసాద్.. ఏం చేస్తాడో?
By: Tupaki Desk | 12 Nov 2018 11:26 AM GMTదశాబ్ద కాలానికి పైగా తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అతడి ముందున్న సీనియర్లు సైడైపోయారు. తర్వాత వచ్చిన కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కొంత కాలం హవా సాగించి తర్వాత తెర మరుగయ్యారు. దేవి మాత్రం ఒకసారి నంబర్ వన్ అనిపించుకున్నాక ఆ స్థానంలోనే కొనసాగుతున్నాడు. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి వాళ్ల పోటీని తట్టుకుని తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగిపోయాడు. కానీ ఈ మధ్య దేవి నుంచి ఆశించిన ఔట్ పుట్ రావడం లేదు. పోయినేడాది ‘ఎంసీఏ’.. ఈ ఏడాది ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి ఆడియోలతో దేవి తీవ్ర నిరాశకు గురి చేశాడు. వీటిలో దేవి ప్రత్యేకతను చాటే పాట ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం విషయంలోనూ నిరాశ తప్పలేదు. మధ్యలో ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ లాంటి ప్రెస్టీజియస్ సినిమాల్లో దేవి సంగీతం బాగానే అనిపించింది.
కానీ మిగతా సినిమాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు దేవి నుంచి రాబోతున్న పెద్ద సినిమా ‘వినయ విధేయ రామ’ విషయంలో మెగా అభిమానులకు చాలా డౌట్లు కొడుతున్నాయి. దీని టీజర్లో దేవి తన పాత సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ రిపీట్ చేయడం విమర్శలకు దారి తీసింది. ఎన్నడూ లేని విధంగా దేవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఇక సినిమాలో మాత్రం దేవి ఏం వైవిధ్యం చూపించి ఉంటాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మామూలుగానే బోయపాటి సినిమాలు రొటీన్ గా ఉంటాయి. దీనికి తోడు పాటలు.. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా ఉంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని సందేహిస్తున్నారు. ఇప్పటికే పాటలు.. నేపథ్య సంగీతం పూర్తయ్యాయో లేదో కానీ.. దేవి కొంచెం అప్రమత్తంగా లేకపోతే మాత్రం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. చూడాలి మరి అతడి ఔట్ పుట్ ఎలా ఉంటుందో?