Begin typing your search above and press return to search.
మెగా -నందమూరి ఫ్యాన్స్.. వినండహో!!
By: Tupaki Desk | 23 Sep 2015 6:25 PM GMTహీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఫైట్స్ చేసుకుంటారో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు భౌతికంగానూ దాడులకు దిగుతుంటారు. తాజగా భీమవరం పవన్ - ప్రభావ్ అభిమానుల గొడవ ఇలాంటిదే. అయితే.. ఇలాంటి వివాదాలు ఫ్యాన్స్ మధ్యే తప్ప.. స్టార్లు మాత్రం స్నేహంగానే ఉంటారు. నిజజీవితంలో మంచి స్నేహితులుగా కూడా ఉంటారు. కానీ ఆన్ స్క్రీన్ లో తమ ఫ్రెండ్ షిప్ పంచుకున్నది తక్కువే. ఇప్పుడీ ఎపిసోడ్ కూడా స్టార్ట్ కానుంది. మెగా - నందమూరి అభిమానుల మధ్య అభిప్రాయ బేధాలు చాలానే ఉంటాయి..
చిరు - బాలయ్యల మధ్య అనుబంధం చాలానే ఉంటుంది. ఈ విషయం చిరు బర్త్ డే రోజున ఆయన్ని ముద్దాడిమరీ అభిమానాన్ని చాటారు బాలకృష్ణ. నిజంగా మెగాస్టార్ పై అభిమానం లేకపోతే.. బాలయ్య అంత క్లోజ్ గా బిహేవ్ చేయరని ఈజీగానే చెప్పొచ్చు. అంతే కాదు పవన్ ఎన్టీఆర్ లు కూడా.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చరణ్ పెళ్ళి రోజున డే రోజున చాటి చెప్పారు. ఆ ఫంక్షన్ అంతా వీరిద్దరూ కలిసే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా ఆడియో రిలీజ్ రోజున.. చరణ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదని చెప్పచ్చు. మగధీర డైలాగులు ఇరగదీసి చెబుతున్న చిన్నారిని.. బాలయ్య డైలాగులు చెప్పమని అడిగి మరీ చెప్పించుకున్నాడు చరణ్. ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యతని చాటి చెప్పేందుకు ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.
తాజాగా మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ నటిస్తున్న సుప్రీం ఓపెనింగ్ కి.. చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు కళ్యాణ్ రామ్. తను నటించిన పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సుప్రీమ్ కి కూడా దర్శకుడు కావడంతో ఇలా సెట్ అయింది. ఈ సంఘటనలు నందమూరి, మెగా కుటుంబాల మధ్య రాజకీయ, వ్యక్తిగత విబేధాలు లేవనే విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇకనైనా అభిమానులు కూడా ఇంత సఖ్యతగా మెలగాలి. ఏమంటారు గయ్స్!!