Begin typing your search above and press return to search.

అన్నయ్యపై పవన్‌ ట్వీట్‌ ప్రకంపనం

By:  Tupaki Desk   |   19 Aug 2015 1:32 PM GMT
అన్నయ్యపై పవన్‌ ట్వీట్‌ ప్రకంపనం
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రతి కదలికా ఒక ప్రకంపనమే. ట్విట్టర్‌ లో అతడి ప్రతి మూవ్‌ మెంటుకు, కామెంటుకు అంతే స్పందన వస్తుంది. ఆన్‌ లైన్‌ లో ప్రతి సందర్భంలోనూ అతడు స్పందించిన తీరు మెగా ప్రకంపనమే. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోసేలా సవాల్‌ విసరడానికి ట్వీట్ ను కూడా ఆయుధంగా చేసుకున్నాడు. అయితే అన్నయ్యపై మాత్రం ఎప్పుడూ కించింత్‌ మాట జారకుండా తన విధేయతను చాటుకున్నాడు.

అంతేనా పవన్‌ ట్విట్టర్‌ లోకొచ్చాక అతడు చేసే ప్రతి కామెంట్‌ సెన్సేషన్‌ అవుతూనే ఉన్నాయి. అమరావతి భూములు పైనా స్పందించాడు. నరేంద్ర మోదీ గురించో, జాతీయ స్థాయి విషయాల గురించో ప్రస్థావించినా జనాల్లో అంతే కదలిక తెచ్చాడు. అయితే పబ్లిక్‌ వేడుకల్లో కానీ, ట్విట్టర్‌ లో కానీ ఎప్పుడూ అతడు అన్నయ్య ప్రస్థావనే తేలేదు. గోపాల గోపాల ఆడియోలో, ఈటీవీ 20ఏళ్ల పండుగ లో ఆ ఊసే ఎత్తలేదు. చిరు పై తనకి ఉన్న ప్రేమను కానీ, ఇతరత్రా విషయాల్ని కానీ ఎప్పుడూ ప్రస్థావించలేదు. జనసేన పార్టీని స్థాపించినప్పుడు మాత్రమే అన్నయ్య ఎప్పుడూ తన గుండెల్లో ఉంటాడని చెప్పాడంతే. అయితే ఇప్పుడు అన్నయ్య గురించి పవన్‌ స్పందించే సమయం వచ్చింది.

ఆగష్టు 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. పైగా 60వ జన్మదినం, షష్ఠి పూర్తి అకేషన్‌. కాబట్టి పవన్‌ 21ఆగష్టు 12 గంటల లోపే స్పందించాల్సిందే. ప్రస్తుతం గుజరాత్‌ లో సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ షూటింగులో బిజీ. అయినా ఆరోజు అన్నయ్యకు విషెస్‌ చెప్పాల్సిన సందర్భం ఉంది. మరి పవన్‌ ట్వీట్‌ కోసం లక్షలాది మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చెబుతాడో, ఎలాంటి ప్రకంపనాలు వస్తాయో వేచి చూడాల్సిందే.