Begin typing your search above and press return to search.

త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. కారణం అదే..!

By:  Tupaki Desk   |   21 May 2021 2:30 AM GMT
త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. కారణం అదే..!
X
దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన త్రిష.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది. కొత్త హీరోయిన్లకు పోటీనిస్తూ టాప్ లీగ్ లో కొనసాగుతోంది. అయితే కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీకి.. టాలీవుడ్ లో మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. ఆమె చివరగా 2016లో 'నాయకి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా పరాజయం చెందడంతో మళ్ళీ తెలుగులో ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతోందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే త్రిష పై మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోందట.

వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ''ఆచార్య'' సినిమాలో ముందుగా త్రిష ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ త్రిష 'ఆచార్య' కు టాటా చెప్పింది. దీంతో చేసేదేమీ లేక కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. చిరు మాత్రం మణిరత్నం సినిమాకి డేట్స్ ఇవ్వడంతో త్రిష తన సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ వ్యవహారం మెగా ఫ్యాన్స్ కు త్రిష పై కోపం తెప్పించింది. అయితే అప్పుడు చిరంజీవి కి నో చెప్పిన త్రిష.. ఇప్పుడు బాలయ్య కు ఎస్ చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. బాలయ్య కోసం ఓ పవర్‌ ఫుల్ కథను రెడీ చేసిన దర్శకుడు.. ఒక హీరోయిన్ గా త్రిష ని సంప్రదించారట. ఇంతకుముందు 'లయన్' సినిమాలో బాలయ్య సరసన నటించిన త్రిష.. స్టోరీ నచ్చడంతో మరోసారి నటించడానికి సిద్ధమైందని.. ఈసారి పెద్ద ప్రాజెక్ట్ ని వదులుకోడానికి రెడీగా లేదని టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది.