Begin typing your search above and press return to search.
'మెగాస్టార్స్ మెగా ర్యాప్' తో అదరగొట్టిన మెగా ఫ్యాన్స్...!
By: Tupaki Desk | 21 Aug 2020 11:00 PM ISTరేపు మెగాస్టార్ చిరంజీవి తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. చిరు పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ప్రతి ఏటా చిరు బర్త్ డే నాడు ఆయన ఫ్యాన్స్ రక్తదానాలు.. అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ జనసమూహంగా జరిపే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది చరణ్ -చిరంజీవి బర్త్ డే వేడుకలు నిర్వహించే 'రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం' మెగాస్టార్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా చేయాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో చిరు బర్త్ డే ట్రిబ్యూట్ గా 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' పేరుతో ఓ ర్యాప్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
కాగా ఇప్పటికే 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' సాంగ్ గ్లిమ్స్ విడుదల చేసిన ఫ్యాన్స్ తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'బాసు కోసమే చేసిన ర్యాప్.. తడబడలేని తెలుగు ర్యాప్.. స్కార్పియన్ యాజ్ అనథర్ బ్యాంగ్.. జై బోలో మెగాస్టార్' అంటూ సాగిన ఈ ర్యాప్ సాంగ్ చిరంజీవి సినిమాల పేర్లతో.. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడించింది. ప్రపంచం మొత్తం గడగడలాడే కరోనా సైతం నీకు గజగజ వణుకుతుందని.. సీసీసీ ఛారిటీ ద్వారా ఇండస్ట్రీకి అండగా ఉంటున్నారని.. రక్తదానం మరియు నేత్రదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఈ సాంగ్ తో చిరంజీవి సేవాగుణాన్ని తెలియజేసారు.
ఈ 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' సాంగ్ ని వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించగా సురేంద్ర ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వారు వీడియోని కంపోజ్ చేశారు. చిరు బర్త్ డే స్పెషల్ గా వచ్చిన ఈ ర్యాప్ సాంగ్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు చిరంజీవి బర్త్ డే కామన్ డీపీ ని రామ్ చరణ్ విడుదల చేయగా.. మెగాస్టార్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్ ని సినీ ఇండస్ట్రీలోని 100 మంది ప్రముఖులు రిలీజ్ చేశారు.