Begin typing your search above and press return to search.
సల్మాన్ భాయ్ కి స్వాగతం పలికిన మెగా 'గాడ్ ఫాదర్'..!
By: Tupaki Desk | 16 March 2022 5:21 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ "గాడ్ ఫాదర్". మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' సినిమాకి తెలుగు రీమేక్. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ 'గాడ్ ఫాదర్' సెట్ లో అడుగుపెట్టారు.
చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "సల్మాన్ ఖాన్ భాయ్ `గాడ్ ఫాదర్` మీకు స్వాగతం పలుకుతున్నారు. మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజ పరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ప్రెజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు" అని చిరు ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కి స్వాగతం పలుకున్న ఓ ఫోటోని చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఈ యుగంలో ఇద్దరు లెజెండ్స్ కలిసిన అరుదైన విషయం ఇదని.. ఇండియాలోని మోస్ట్ ఫేవరేట్ సల్మాన్ భాయ్ కి స్వాగతం పలుకుతున్నామని 'గాడ్ ఫాదర్' టీమ్ పేర్కొంది.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. ఈ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. తెలుగు వెర్సన్ స్క్రిప్ట్ లో దర్శకుడు మోహన్ రాజా చాలా మార్పులు చేసారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను జోడించారు.
ఒరిజినల్ వెర్షన్ కంటే గ్రాండియర్ గా హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ పాత్ర నిడివి కూడా పెంచినట్లు టాక్. ఏదేమైనా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
చిరంజీవి - రామ్ చరణ్ లతో ఉన్న సాన్నిహిత్యంతో సల్మాన్ ఖాన్ కనీసం పాత్ర గురించి కూడా అడగకుండా ఈ ప్రాజెక్ట్ చేయడానికి వెంటనే అంగీకరించారని తెలుస్తోంది. ఇందులో నయన తార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' ను తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ భాషల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.