Begin typing your search above and press return to search.

సామ్ పై మెగా హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

By:  Tupaki Desk   |   28 April 2022 12:30 PM GMT
సామ్ పై మెగా హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
X
క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో త‌న పంథా మార్చుకుంది స‌మంత‌. 'ఓ బేబీ', యూట‌ర్న్, మ‌జిలీ వంటి చిత్రాల‌తో కొత్త దారిని ఎంచుకుంది. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టిస్తూ మ‌రింత క్రేజ్ ని సొంతం చేసుకుంటోంది. సామ్ న‌టించిన తాజా చిత్రం 'శాకుంత‌లం'. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా స్టార్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

నేడు స‌మంత పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలోని సామ్ స‌రికొత్త లుక్ కు సంబంధించిన పోస్ట‌ర్ ని మేక‌ర్స్ గురువారం విడుద‌ల చేశారు. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఇవి నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇదిలా వుంటే సామ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా మెగా హీరో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌మంత‌పై ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. సామ్ కు సాయి ధ‌ర‌మ్ తేజ్ వీరాభిమాని. ఈ విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా వేదిక‌ల‌పై చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స‌మంత హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన 'ఏమాయ చేసావె' అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆ సినిమాపై మ‌న‌సు పారేసుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు కూడా. తాజాగా మ‌రోసారి సామ్ పై త‌న అభిమానాన్ని చాటుకున్నారు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.

గురువారం స‌మంత పుట్టిన రోజు కావ‌డంతో అంద‌రికంటే భిన్నంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. జెస్సీ నువ్వు ఏమాయ చేసావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు... హ్యాపీ బ‌ర్త్ డే స‌మంత‌.

నిన్ను అమితంగా ఇష్ట‌ప‌డే అభిమాని' అంటూ సామ్ న‌టించిన సినిమాల‌ని ఉన‌యోగించి స‌మంత‌కు విషేష్ చెప్పడం ఇప్ప‌డు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. సాయ్ ధ‌ర‌మ్‌ తేజ్ తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు, స్టార్ హీరోయిన్ లు స‌మంత‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.