Begin typing your search above and press return to search.
బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో మెగా హీరో సినిమా..?
By: Tupaki Desk | 2 Feb 2022 6:30 AM GMTమెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ చిత్రాల వెనుక పరుగెత్తకుండా కంటెంట్ ఉన్న సినిమాలతో మెప్పిస్తున్నారు. 'కంచె' 'ఫిదా' 'తొలిప్రేమ' 'ఎఫ్ 2' 'గద్దలకొండ గణేష్' వంటి చిత్రాలలో మంచి విజయాలు అందుకుంటున్నారు. ‘అంతరిక్షం’ లాంటి కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పటికీ, కొత్త కథలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ మరోసారి తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో గత కొంతకాలంగా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలలో కూడా తమ మార్కెట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ కూడా ఒక పాన్-ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే లేటెస్టుగా ఫిలిం సర్కిల్స్ వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగా ప్రిన్స్ ఇప్పటికే ఓ మల్టీ లాంగ్వేజ్ ఫిలింకి ఓకే చెప్పారట. అది బాలాకోట్ వైమానిక దాడుల ఆధారంగా రెడీ చేసిన కథతో తెరకెక్కనుందట.
పుల్వామా ఘటన తర్వాత భారత యుద్ధ విమానాలు 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై బాంబు దాడి చేసి అన్నిటిని ధ్వసం చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టు శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలతో అత్యంత బాధ్యతాయుతంగా మన దేశం ఈ దాడులు నిర్వహించింది. ఈ స్క్రిప్ట్ నచ్చడంతో వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.
భారీ స్థాయిలో నిర్మించబడే ఈ పాన్ ఇండియా చిత్రంలో వరుణ్ తేజ్ భారతీయ సైనికుడిగా కనిపించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. బాలాకోట్ వైమానిక దాడుల ఆధారంగా సినిమా అంటే కచ్చితంగా వరుణ్ తేజ్ కెరీర్ లో నిలిచిపోతుందని అనుకోవచ్చు.
ప్రస్తుతానికి వరుణ్ తేజ్ 'గని' అనే బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 25న లేదా మార్చి 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ నటించిన 'ఎఫ్ 3' సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది 'ఎఫ్ 2' సినిమా ఫ్రాంచైజీలో రూపొందింది.