Begin typing your search above and press return to search.

మెగా హీరో.. సౌజన్య త్రివిక్రమ్‌ కాంబో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   15 Sep 2022 1:30 PM GMT
మెగా హీరో.. సౌజన్య త్రివిక్రమ్‌ కాంబో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ ఆ తర్వాత చేసిన కొండ పొలం మరియు రంగ రంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. రెండు సినిమాలు కూడా కమర్షియల్‌ గా తీవ్రంగా నిరాశ పర్చడంతో వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా ఎలా ఉంటుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వరుసగా రెండు ఫ్లాప్ లు పడ్డ కారణంగా కచ్చితంగా తదుపరి సినిమా విషయంలో ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో వైష్ణవ్‌ తేజ్ కావాల్సినంత ఫోకస్‌ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైష్ణవ్‌ తేజ్ నాల్గవ సినిమా ఖరారు అయ్యింది. త్రివిక్రమ్‌ భార్య సౌజన్య నిర్మాణంలో వైష్ణవ్‌ తేజ్ నాల్గవ సినిమా అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతుంది.

శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. సౌజన్య ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి నిర్మించబోతున్నారు కనుక సహజంగానే స్క్రిప్ట్‌ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ యొక్క ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుంది. స్క్రిప్ట్‌ లో సూచనలు మొదలుకుని ఎడిటింగ్‌ వరకు త్రివిక్రమ్‌ యొక్క ఇన్‌ పుట్స్ ని ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం వైష్ణవ్‌ తేజ్ మాస్ లుక్ కి మారబోతున్నాడట. ఇప్పటి వరకు ఈయన చేసిన పాత్రలన్నీ కూడా కాస్త క్లాస్ టచ్ ఉన్న పాత్రలే. ఉప్పెనలో మాస్ గా కనిపించిన కూడా బాడీ లాంగ్వేజ్ క్లాస్ గానే ఉంటుంది. ఇప్పుడు లక్‌ తో పాటు బాడీ లాంగ్వేజ్ మరియు బాడీ కూడా మాస్ స్క్రిప్ట్‌ కి అనుకూలంగా వైష్ణవ్‌ తేజ్ మారేందుకు వర్కౌట్స్ మొదలు పెట్టాడట.

ఒక వైపు స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతూనే ఉండగా మరో వైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సౌజన్య త్రివిక్రమ్‌ తన సొంత బ్యానర్ అయిన ఫొర్టీన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ లో చూసుకోబోతున్నారు. జాతిరత్నాలు హీరో నవీన్‌ పొలిశెట్టితో కూడా సౌజన్య ఒక సినిమాను నిర్మిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.