Begin typing your search above and press return to search.

ఫ్రెండ్షిప్ కోసం మెగా హీరో స్పెష‌ల్ సాంగ్‌!

By:  Tupaki Desk   |   1 Nov 2022 3:30 PM
ఫ్రెండ్షిప్ కోసం మెగా హీరో స్పెష‌ల్ సాంగ్‌!
X
ఫ్రెడ్షిప్ కోసం టాలీవుడ్ హీరోలే కాదు బాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్, శాండ‌ల్ వుడ్‌ హీరోలు ప్ర‌త్యేక పాత్ర‌ల్లోనూ.. స్పెష‌ల్ సాంగ్స్ లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌న హీరోల కోసం ప‌ర భాషా హీరోలు కీల‌క అతిథి పాత్ర‌ల్లో న‌టించ‌డం.. లేదా.. ప్ర‌త్యేక గీతాల్లో మెర‌వ‌డం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మారింది. బాలీవుడ్ హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌బోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ కాబోతోంది.

వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తూ నిర్మిస్తున్న మూవీ 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌'. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'వీరం' ఆధారంగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి ఫ‌ర్హాద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ తో పాటు యోయో హ‌నీ సింగ్, త‌నిష్క్ బ‌గ్జీ, లిజ్జో జార్ట్ సంగీతం అందిస్తున్నారు.

'కేజీఎఫ్‌' ఫేమ్ ర‌వి బాస్రూర్ నేప‌థ్య సంగీతం అందిస్తున్నాడు. జ‌గ‌ప‌తిబాబు మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 21న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్ ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ మూవీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో మెర‌వ‌నున్నాడ‌ని తెలుస్తోంది. సినిమాలోని కీల‌క ఘ‌ట్టంలో వ‌చ్చే ఓ ప్ర‌త్యేక గీతంలో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నాడు.

స‌ల్మాన్ ఖాన్ తో వున్న ఫ్రెండ్షిప్ కార‌ణంగానే రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీలోని ఓ స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' మూవీతో రామ్ చ‌ర‌ణ్ కోసం కీల‌క అతిథి పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ ప‌న‌టించిన విష‌యం తెలిసిందే. తానికి బ‌దులుగా రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌డు స‌ల్మాన్ ఖాన్ కోసం 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌' మూవీలోని స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని చెబుతున్నారు. చ‌ర‌ణ్ పాల్గొన‌గా ప్ర‌త్యేక గీతాన్ని ఎప్పుడు చిత్రీక‌రించ‌బోతున్నారు? ఆ పాట సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నుందా? అనే విష‌యాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించే అవ‌కాశం వుంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.