Begin typing your search above and press return to search.
మళ్లీ రింగ్ లో దిగిన మెగా హీరో
By: Tupaki Desk | 16 Jun 2020 6:50 AM GMTవరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతో అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ పూర్తి స్థాయి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూట్ కూడా పూర్తి చేశారు. అయితే సినిమా మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. వైజాగ్ లో చిత్రీకరణ జరుపుతున్న యూనిట్ సభ్యులు హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు.
షూటింగ్స్ కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో మళ్లీ సెట్స్ పైకి ఈ చిత్రంను తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత రెండు నెలులగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ప్రాక్టీస్ తగ్గడంతో వరుణ్ మళ్లీ బాక్సింగ్ గ్లౌజ్ ధరించి ప్రాక్టీస్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చిత్రం కోసం కొత్త లుక్ లో వరుణ్ కనిపించబోతున్నాడు. షూటింగ్ ప్రారంభం అయ్యే లోపు మళ్లీ మునుపటి వెయిట్ కు వరుణ్ వచ్చేందుకు వర్కౌట్స్ చేయడంతో పాటు బాక్సింగ్ ను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట.
ఈ చిత్రం కోసం అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ వద్ద వరుణ్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సినిమా కోసం ఆయన నుండి ఎన్నో టిప్స్ ను అందుకున్నాడు. ఇదే సమయంలో వరుణ్ కొత్త జిమ్ లో గంటల తరబడి గడుపుతున్నాడట. ఇక ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ను ఎంపిక చేశారు.