Begin typing your search above and press return to search.
100 కోట్ల క్లబ్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్
By: Tupaki Desk | 6 March 2021 9:50 AM GMT100 కోట్ల క్లబ్.. ఈ ఊహే ఒక డెబ్యూ హీరోకి అసాధ్యం. కానీ ఆ అరుదైన ఫీట్ ని సాధించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. నటించిన తొలి సినిమాతోనే ఇంతటి రేర్ రికార్డును సాధించి ఔరా! అనిపించాడు. వస్తూనే కుంభాన్ని కొట్టాడనే చెప్పాలి. అది కూడా ఒక అసాధారణ క్రైసిస్ తర్వాత ఏమవుతుందో అనుకుంటున్న వేళ అతడు గురి చూసి బాణం కొట్టాడు.
వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ -సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఉప్పెన టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనేంతటి విజయాన్ని అందుకుని డెబ్యూ హీరోని 100కోట్ల క్లబ్ లోకి చేర్చింది. ఈ విజయాన్ని వైష్ణవ్ సహా ఉప్పెన టీమ్ సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. తాజాగా 100 కోట్ల గ్రాస్ క్లబ్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసింది మైత్రి సంస్థ. ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఆనందం వ్యక్తం చేసింది.
వంద కోట్ల గ్రాస్ అంటే 50కోట్ల షేర్ క్లబ్ లో అడుగుపెట్టిందనే అర్థం. 22 రోజుల్లోనే ఇలాంటి అరుదైన ఫీట్ ని అందుకుంది ఉప్పెన. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డెబ్యూ రికార్డును..అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ వారసుడు రామ్‌చరణ్ డెబ్యూ రికార్డును.. నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ రికార్డుల్ని కూడా వైష్ణవ్ బ్రేక్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.