Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుడి సినిమా కూడా ఆ జాబితాలో చేరేనా..?
By: Tupaki Desk | 31 Aug 2022 4:40 AM GMTమెగా మేనల్లుడు, సాయి తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్.. 'ఉప్పెన' సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. డెబ్యూ మూవీతోనే 100 కోట్లకు పైగా వసూళ్ళతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన 'కొండపొలం' చిత్రం డిజాస్టర్ గా నిలిచి వైష్ణవ్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు ''రంగ రంగ వైభవంగా'' సినిమాతో పలకరించడానికి రెడీ అయ్యాడు.
యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా RVM చిత్రాన్ని తెరకెక్కించారు. మేకర్స్ వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. కంటెంట్ రొటీన్ గా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. ఏదో విషయం ఉంటుందనే ఆసక్తిని కలిగించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలన్నీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా ఉంది. సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
'రంగ రంగ వైభవంగా' చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. రెండు ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని.. ఇద్దరి మధ్య ఉండే గిల్లికజ్జాలు ఆడియన్స్ కి బాగా నచ్చుతాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ఎంటర్టైనర్ రాలేదని వైష్ణవ్ ప్రకటించడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
ఇటీవల కాలంలో 'బింబిసార' 'సీతారామం' 'కార్తికేయ 2' వంటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'లైగర్' మూవీ ఈ జాబితాలో చేరలేకపోయింది. ఇప్పుడు RRV లో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే కంటెంట్ ఉంటే కచ్చితంగా మంచి వసూళ్ళు వస్తాయి.
బాక్సాఫీస్ వద్ద వైష్ణవ్ తేజ్ సినిమాకి పెద్దగా పోటీ కూడా లేదు. విక్రమ్ నటించిన 'కోబ్రా' మరియు అనుదీప్ కేవీ స్టోరీ అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' వంటి రెండు సినిమాలు అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన జోనర్ సినిమాలు. అందులోనూ రంగ రంగ ఇప్పటికే తగినంత బజ్ క్రియేట్ చేసింది. ఇది మంచి ఓపెనింగ్స్ సాధించడానికి సహాయపడుతుంది.
ఒక హిట్టు ఒక ప్లాప్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇది అతనితో పాటు పరిశ్రమకు కూడా మంచిదే. ఈరోజుల్లో ఏ సినిమా అయినా కమర్షియల్ విజయం సాధించాలంటే.. కంటెంట్ కు తగ్గట్టుగా మంచి మౌత్ టాక్ మరియు పాజిటివ్ రివ్యూలు రావడం కీలకంగా మారింది. మరి RRV కూడా రీసెంట్ బ్లాక్ బస్టర్స్ సరసన చేరుతుందో లేదో చూడాలి.
కాగా, 'రంగ రంగ వైభవంగా' చిత్రానికి తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య దర్శకత్వం వహించారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.