Begin typing your search above and press return to search.
డేటింగ్ లో ఉన్నానంటూ.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో..!
By: Tupaki Desk | 16 Feb 2021 3:30 AM GMTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన సాయి తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న పుకారే అయినప్పటికీ.. ఈసారి మాత్రం నిజంగానే మెగా హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాక మెగా ఫ్యామిలీ ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారని.. రాబోయే మే నెలలో తేజ్ పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి తేజ్ తన వివాహం గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేశాడు.
తన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన 'ఉప్పెన' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ - నిహారిక - వైష్ణవ్ లతో కలిసి సాయి తేజ్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ప్రస్తుతం ఓ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నానంటూ చెప్పాడు సాయి తేజ్. ఆ తర్వాత దీనిపై క్లారిటీ ఇస్తూ.. ''మరి లేకపోతే ఏంటి? నేను డేటింగ్ లో ఉండడం కాదు.. మే నెలలో నా పెళ్లి కూడా జరుగుతుందంట'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. దీంతో ఇండైరెక్టుగా తన పెళ్లి వార్తలు నిజం కాదని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని సుప్రీమ్ హీరో క్లారిటీ ఇచ్చినట్లైంది.