Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ టాప్-10పై మెగా పంజా
By: Tupaki Desk | 3 April 2018 4:59 AM GMTఓవర్సీస్ లో ఒక్క పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మెగా హీరోల సినిమాలకు అంతగా క్రేజ్ ఉండదు.. అనే ఓ దురభిప్రాయం ఉండేది. అత్తారింటికి దారేది తర్వాత మళ్లీ మరే సినిమా కూడా మెగా మూవీ కూడా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేదు. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ రంగంలోకి దిగారో.. లెక్కలు మారిపోవడం స్టార్ట్ అయింది.
ఖైదీ నంబర్ 150తో వస్తూ వస్తూనే యూఎస్ టాప్-5లో చోటు సాధించేశారు చిరంజీవి. ఆ తర్వాత వచ్చిన ఫిదా మూవీ కూడా 2 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటేసి.. షాక్ ఇచ్చింది. అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ టాక్ తో కూడా 2 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. ఇప్పుడు రంగస్థలం విషయంలో అయితే వసూళ్ల రచ్చ జరుగుతోంది. మూడు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి వచ్చిన రంగస్థలం.. 3 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఖాయం అయిపోగా.. యూఎస్ లో టాప్-3 స్థానాన్ని ఆక్రమించడానికి రెడీగా ఉంది.
ఇప్పటివరకూ అయితే.. టాప్-10లో నాలుగు మెగా మూవీస్ 2 ఉండగా.. అన్నీ 2 మిలియన్ డాలర్లను దాటేశాయి. హిట్ రేంజ్ ప్రకారం లైనప్ చూస్తే.. రంగస్థలం మూవీ(2.5 మిలియన్ +)తో రామ్ చరణ్.. ఖైదీ నంబర్ 150(2.447 మిలియన్స్)తో మెగాస్టార్ చిరంజీవి.. ఫిదా(2.074 మిలియన్స్)మూవీతో వరుణ్ తేజ్.. అజ్ఞాతవాసి(2.065 మిలియన్ డాలర్లు)తో పవన్ కళ్యాణ్.. టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు. సెంటర్ ఏదైనా మెగా పంజా ఎలాంటిదో చూపించేస్తున్నారు మెగా హీరోస్.