Begin typing your search above and press return to search.
ఫంక్షన్లందు మెగా ఫంక్షన్లు వేరయా
By: Tupaki Desk | 1 Aug 2016 7:15 AM GMTఅల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్.. సాయిధరం తేజ్ నటించిన తిక్క ఆడియో లాంఛ్ ఒక్క రోజు గ్యాప్ లో జరిగాయి. శిరీష్ సినిమా ఫంక్షన్ కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మరోవైవు సాయిధరం తేజ్.. మెగా ఫ్యామిలీ హీరో అయినా తిక్క మూవీ ఆడియో ఫంక్షన్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీ మెంబర్లు కనిపించలేదు. ఇప్పుడు ఇదే పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోయింది.
బహుశా తేజు పిలవలేదో.. వాళ్లకి కుదరలేదో చెప్పలేం కానీ.. తిక్క ఫంక్షన్ కి మాత్రం ఎవరూ వెళ్లలేదు. అల్లు అరవింద్.. నాగబాబు లాంటివాళ్లు కనిపించినా ఆ లోటు అనిపించేది కాదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో మెయిన్ పాయింట్ ఏంటంటే.. శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ లో పవర్ స్టార్ జపం వినిపించలేదు. ముందు రోజు జరిగిన తిక్క ఆడియో లాంఛ్ లో సీన్ ఇంత సుతారంగా లేదు. తేజు ఏకంగా 'అరుస్తాను బ్రదర్' అనాల్సి వచ్చింది. మాజీ హోమంత్రి జానా రెడ్డి మాట్లాడుతుంటే కూడా పవర్ స్టార్ అంటూ కేకలు పెట్టి.. విసిగించేసిన వైనం కనిపించింది. అయితే.. చిరంజీవి హాజరైన శిరీష్ సినిమా ఫంక్షన్ లో మాత్రం ఎక్కడా పవర్ స్టార్అరుపులు వినిపించనే లేదు.
మెగాస్టార్ చిరంజీవి.. పక్కనే అల్లు అరవింద్ ఉండడంతో మెగా కళ ఉట్టిపడింది. పవర్ స్టార్ అయినా.. రామ్ చరణ్ అయినా.. బన్నీ అయినా.. ఇలా ఎవరు పిలిచినా ఎవరిసినిమాకైనా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని.. శిరీష్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఏదేమైనా కూడా ఈ మధ్యన అసలు మెగా ఫంక్షన్లలో ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. అందుకే.. ఫంక్షన్లందు మెగా ఫంక్షన్లు వేరయా అనేది.