Begin typing your search above and press return to search.

పోలీసోళ్ళపై పడ్డ మెగా ఫ్యామిలీ..

By:  Tupaki Desk   |   20 Oct 2015 3:43 AM GMT
పోలీసోళ్ళపై పడ్డ మెగా ఫ్యామిలీ..
X
పోలీస్... నేటి(నవ) తరం సినిమాలలో ఎన్ని రకాల కధానాయక పాత్రలు వున్నా పోలీస్ పాత్రకుండే విశిష్టత వేరు. అందుకే సినిమాలో హీరో పోలీస్ అనగానే ఆ సినిమావైపు తెలియకుండానే దృష్టిమళ్ళుతుంది. హీరో క్యారక్టర్ ని పోలీస్ గా ఇంట్రడ్యుస్ చేస్తే ఎలివేషన్ సీన్లకు, పవర్ ఫుల్ రోల్ లకు దర్శకుడికి తేలికవుతుంది.

అయితే ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకా అంటే యాద్రుచికమో, దైవ నిర్ణయమోగానీ ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోలంతా పోలీస్ డ్రెస్ లలోనే కనిపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మరోసారి కిలాడీ పోలీస్ గా కనిపించనున్నాడు. గబ్బర్ సింగ్ స్టైల్ లోనే షర్టు బటన్స్ తీసి, కండువా వేసి ఎక్కడ కనిపించినా అలరించడం విశేషం.

సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్' ఫస్ట్ లుక్ లో ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించినా ఇటీవల జరుగుతున్న వేడుకలలో ఖాకీ దుస్తులలో మెరవడం విశేషం. బన్నీ - బోయపాటిల 'సరైనోడు'లో సైతం స్టైలిష్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా కనువిందు చేయనున్నాడు. ఇక చరణ్ 'బ్రూస్ లీ'లో పోలీస్ గెట్ అప్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన సంగతి తెలిసినదే. తన తదుపరి చిత్రం తమిళ రీమేక్ లో కూడా హీరో పోలీస్ ఆఫీసరే.. అదన్నమాట మెగా వారి ఖాకీ హంగామా..