Begin typing your search above and press return to search.
ఫోకస్: 'మెగా' పండుగల కబ్జా
By: Tupaki Desk | 7 Sep 2015 2:16 AM GMTమెగా హీరోలు.. ఈ మాట నుంచి మెగా బ్యాచ్ అనే స్థాయిలో పెరిగిపోయింది ఈ ఫ్యామిలీలో హీరోల సంఖ్య. చిరంజీవి నుంచి మొదలుపెడితే... పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - సాయి ధరం తేజ్ - వరుణ్ తేజ్‌లతో పాటు ఇంకా ఒకట్రెండు పేర్లు కూడా ఉన్నాయి. ఇంత మంది ఉండడంతో... ప్రతీ పండక్కీ ఎవరో ఒకరి సినిమా రిలీజైపోతోంది.
త్వరలో వస్తున్న సినిమాలను ఒకసారి పరిశీలిస్తే... సెప్టెంబర్ 24 బక్రీద్ పండుగ రోజున సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ సాయిధరం తేజ్ వస్తున్నాడు. పట్టుమని పది రోజులు గడవకుండానే అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు కంచె కోసం కర్చీఫ్ వేసేశాడు వరుణ్ తేజ్. అప్పటి నుంచి సరిగ్గా రెండు వారాలకు.. అంటే అక్టోబర్ 16కి బ్రూస్ లీ అంటూ.. రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. చెర్రీ రిలీజ్ మూలంగా అయితే... చిన్నా, పెద్దా ఏ సినిమా కూడా దసరా సీజన్ నే మర్చిపోయారంటే నమ్మండి.
ఇక వచ్చే ఏడాది ప్రారంభానికి ఇప్పటినుంచే లెక్కలు మొదలైపోయాయి. సంక్రాంతికి సర్దార్ గబ్బర్ సింగ్ తేవడం పక్కా అని తేల్చేశారు నిర్మాతలు. ఇంత పెద్ద సీజన్ కాబట్టి మహా అయితే ఇంకో మూవీకి ఛాన్స్ ఉంటుందంతే. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎలాగూ రెడీ ఉంటాడు శివరాత్రి కోసం. మనోడు ఈ ఏడాది ఏప్రిల్ లో సన్నాఫ్ సత్యమూర్తి సోలో రిలీజ్. సమ్మర్ మొత్తం కుమ్మేశాడు. అంతకుముందే పవన్ కూడా గోపాల గోపాలతో పొంగల్ ను సొంతం చేసుకున్నాడు. కాని ఇలా పండగలన్నీ మెగా ఫ్యామిలీనే కబ్జా చేస్తే ఎలా గురూ? సినిమాలకి పండుగ సీజన్ లు చాలా ముఖ్యం. ఒకట్రెండు రోజులు సెలవులు, ముందు వెనక వీకెండ్ లలో కలెక్షన్స్ ఫుల్లుగా ఉంటాయి. అందుకే ఇలా పండుగలే టార్గెట్ గా మూవీలు రిలీజవుతాయి. కానీ... ఇలా అన్ని పండుగలు మెగా టీం ఆక్యుపై చేస్తే... మిగతా వాళ్ల మాటేంటి ? మెగాస్టార్ నుంచి మెగా హీరోల వరకూ కాస్త ఈ విషయం కూడా ఆలోచించాలేమో.
మహేష్ వంటి పెద్ద స్టార్లు.. వారు ఎప్పుడొస్తే అప్పుడే పండగ, కాని మిగిలిన వారికి పండగ సెలవులు అనేవి చాలా ముఖ్యం. బన్నీ, చెర్రీలు పండుగలకు మానేసి మామూలు రోజుల్లో వచ్చినా కలెక్షన్లు ఒకే రేంజులో ఉంటుంది. కనీసం వాళ్ళయినా పండుగలు వదిలేస్తే బెటరేమో. పక్కనోళ్ళని కూడా పండుగలు చేసుకోనివ్వండయ్యా!!