Begin typing your search above and press return to search.

కామెంట్: మెగా వార్ జరుగుతూనే ఉంటుంది

By:  Tupaki Desk   |   25 Jan 2018 5:07 AM GMT
కామెంట్: మెగా వార్ జరుగుతూనే ఉంటుంది
X
ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 9న వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ.. సాయిధరం తేజ్ మూవీ ఇంటెలిజెంట్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఏదో ఒక సినిమాకి రిలీజ్ డేట్ మారుతుందేమో అనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా.. ఇప్పుడు ఈ మెగా హీరోలు విడుదల తేదీపై తేల్చి చెప్పేయడంతో.. మెగా వార్ ఖాయం అయింది.

తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి ఇద్దరు మెగా హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇదే ఆఖరిసారి మాత్రం కాకపోవచ్చు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి.. పవన్ కళ్యాణ్(అప్పుడప్పుడు వస్తాయేమో).. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సాయి ధరం తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. కళ్యాణ్(మెగాస్టార్ చిన్నల్లుడు అరంగేట్రం చేస్తున్నాడు).. ఇలా 8 మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కూడా ప్రిపేర్ అయిపోతున్నాడు. స్టార్ రేంజ్ ఉన్న మొదటి నలుగురు ఏడాదికి ఒకటి చేసి.. మిగిలిన వాళ్లు రెండేసి సినిమాలు చేసినా.. కనీసం ఏడాది 10 నుంచి 15 సినిమాలు అవుతాయన్న మాట.

లాంగ్ వీకెండ్స్.. సమ్మర్.. దసరా.. పొంగల్ లాంటి సీజన్స్ ను చూసుకుని రిలీజ్ ప్లాన్ చేసుకోవడం కామన్ అయిపోయింది కాబట్టి.. ఇక ముందు కూడా మెగా హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయేందుకు అవకాశాలు పుష్కలంగానే ఉంటాయి. కాకపోతే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మెగా హీరోలలో ఎవరి రేంజ్ వారికి ఉంది.

తాము సినిమాలు చేసే జోనర్ విషయంలో కానీ.. క్రేజ్ లో కానీ వైవిధ్యత చూపుతున్నారు. చిన్న హీరో నుంచి స్టార్.. టాప్ స్టార్ వరకూ అన్ని స్టేజ్ లలోను మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఉన్నారు. ఒకరు ప్రయోగాలు చేస్తుంటే.. మరొకరు మాస్ మూవీ.. మరొకరు లవ్ స్టోరీస్.. ఇంకొకరు వైవిధ్యమైన కథలు.. ఇలా విభిన్నంగా కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు. సో.. ఒకేసారి రెండేసి మెగా మూవీస్ విడుదల అయినా.. జనాలకు మెల్లగా అది కూడా అలవాటు అయిపోతుంది లెండి.