Begin typing your search above and press return to search.
ఇది మెగా హీరోల కొత్త సెంటిమెంటా!!
By: Tupaki Desk | 16 Jun 2017 5:28 AM GMTఅల్లు అర్జున్ నటించిన డీజే- దువ్వాడ జగన్నాధం రిలీజ్ అయ్యేందుకు ఇంకో వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ఈలోగా సెన్సార్ సహా ప్రచార సన్నాహాలతోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే బన్నీ తన నెక్ట్స్ మూవీపై కూడా ఫోకస్ పెట్టేశారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న నా పేరు సూర్య స్టార్ట్ చేసేశాడు.
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ ప్రారంభానికి బన్నీ తండ్రి అల్లు అరవింద్.. తల్లి నిర్మల కూడా హాజరయ్యారు. గతంలో ఎవరైనా సీనియర్లతో ఫస్ట్ షాట్ డైరెక్షన్.. క్లాప్ కొట్టించడం వంటివి చేసేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ లోకే వచ్చేస్తున్నాయి. గత కొన్ని సార్లుగా మెగా హీరోలు సినిమా షూటింగ్ ప్రారంభాలలో.. ఇలా అమ్మానాన్నలతో కలిసి కనిపిస్తున్నారు. రామ్ చరణ్ అయితే తప్పకుండా నాన్న చిరంజీవి.. అమ్మ సురేఖలను తీసుకొచ్చేస్తున్నాడు.
సాయిధరం తేజ్ కూడా ప్రతీ ఫంక్షన్ కు అమ్మను తీసుకొచ్చేస్తాడు. వరుణ్ తేజ్ అయితే తండ్రి నాగబాబు లేకుండా అసలు కనిపించనే కనిపించడని చెప్పచ్చు. ఏమైనా ఈ మెగా హీరోలు అమ్మా నాన్నలను షూటింగ్ ప్రారంభాలకు.. ఈవెంట్లకు తీసుకురావడం ఓ ట్రెండ్ చేసేస్తున్నారని చెప్పచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/