Begin typing your search above and press return to search.

మెగా హీరోల‌పై ర‌చ్చ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   30 Nov 2015 7:30 AM GMT
మెగా హీరోల‌పై ర‌చ్చ ర‌చ్చ‌
X
ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే 9 మంది హీరోలు ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్‌ ని క‌లుపుకుని ఇంత‌మంద‌య్యారు. అస‌లు ఒకే ఫ్యామిలీ నుంచి అంత‌మంది హీరోలు పుట్టుకురావ‌డం మంచికేనా? కాదా? దీని వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కి లాభ‌న‌ష్టాలేంటి? ఇత‌ర‌త్రా జ‌నాల‌కు క‌లిగే క‌ష్ట‌మేంటి ? విశ్లేషిస్తే.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలిసొచ్చాయిలా...

ప‌రిశ్ర‌మ‌లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డంపై విమ‌ర్శ‌లు ఇలా ఉన్నాయి.. వీళ్లంతా ఇత‌ర హీరోల్ని నిలువ‌రించేస్తున్నారు. వేరొక‌రికి అవ‌కాశాల్లేకుండా చేస్తున్నారు. హీరోల పేరుతో జ‌నాల‌పైకి బ‌ల‌వంతంగా రుద్దేస్తున్నారు. చిరంజీవి లెగ‌సీని వాడుకుని ఎదిగేందుకు చూస్తున్నారు. ఈ విష‌యంలో చిరు ఎలాంటి కంట్రోల్ విధించ‌డం లేదు.. ఇన్ని ర‌కాల విమ‌ర్శ‌లున్నాయి. అదే పాజిటివ్ యాంగిల్‌ ని ట‌చ్ చేస్తే...

ఇలా హీరోలు పెర‌గ‌డం వ‌ల్ల కాంపిటీటివ్ స్పిరిట్ పెరుగుతుంది. డ్యాన్సులు - ఫైట్స్‌ - న‌ట‌న‌లో పోటీ త‌త్వం పెరిగి క్వాలిటీ పెర్ఫామెన్స్ బైటికొస్తుంది. ఇదంతా మంచికే. ఒకే ఫ్యామిలీ నుంచి అంత‌మంది హీరోలు రావ‌డం అంటే గొప్ప విష‌యం. అది చిరంజీవి గొప్ప‌త‌నం కిందే లెక్క‌.

మెగా హీరోల పేరుతో బోలెడంత ప్ర‌తిభ వెలుగులోకి వ‌స్తుంది. అప్‌ క‌మ్ డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలొస్తాయి. ఇప్ప‌టికే ఉన్న ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు పెరుగుతాయి. టెక్నీషియ‌న్ల‌కు ఛాన్సులొస్తాయి. మెగా బ్రాండ్‌ కి స‌క్సెస్ రేటు ఎలానూ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి దాంతో పాటే ప‌రిశ్ర‌మ కూడా బావుంటుంది..

అయితే హీరోలు పుట్టుకొచ్చినంత మాత్రాన ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఎదిగేయ‌డం ఉండ‌దు. సొంత ట్యాలెంటు - ల‌క్కుతోనే ఎద‌గాలిక్క‌డ‌. అయితే ఏ బ్యాకింగ్ లేకుండా వ‌చ్చే హీరోలు ఎల్ల కాలం కెరీర్‌ ని సాగిస్తార‌ని చెప్ప‌లేం. అదే ఇండ‌స్ర్టీ బ్యాక్‌ గ్రౌండ్‌ తోనే వ‌స్తే కొంత కాలం పాటు నిల‌దొక్కుకోవ‌చ్చు. ఫ్లాపులొచ్చినా పెట్టుబ‌డులు పెట్టే దేవుళ్లు డ‌బ్బు సంచుల‌తో వెన‌క ఉండి ఎంక‌రేజ్ చేస్తారు.