Begin typing your search above and press return to search.

పవర్ రీమిక్సుల మాటేంటి..?

By:  Tupaki Desk   |   3 Sept 2015 11:12 PM
పవర్ రీమిక్సుల మాటేంటి..?
X
గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో రీమిక్స్ ల పర్వం నడుస్తోంది. అప్పట్లో టేప్ రికార్డర్ల లో విన్న పాటని ప్రస్తుతం కాస్త కొత్త వాయిద్యాల తో వాయించి డాల్బీ ఆట్మాస్ లాంటి కొత్త విధానం లో వినిపిస్తున్నారు. ఆల్రెడీ హిట్ అయిన పాటలే గనక ఆ పాటలను వాడుకుంటున్న సినిమాలకు అదో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి ఎంతో కొంత మంచి చేస్తుంది. జగపతి బాబు మొదలుకొని మంచు మనోజ్ వరకు అందరూ ఏదో ఒక సినిమాలో మిక్స్ లకు స్టెప్స్ వేసిన వారే. అందరి మాట ఎలా వున్నా మిక్స్ చేయడం లో స్పెషల్ గా నిలుస్తున్న మెగా హీరోల మేటర్ లోకి వెళదాం.

రీమిక్స్ లు ఎన్ని వచ్చినా యావత్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చింది మాత్రం మగధీర లోని బంగారు కోడిపెట్టే. మెగాస్టార్ పాటకి చరణ్ స్టెప్పులేయడం మెగా అభిమానుల కి ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. తర్వాత వాన వాన పాట తో రచ్చ రచ్చ చేసి శుభలేక రాసుకున్నా అంటూ హట్రిక్ కొట్టేశాడు చెర్రీ. తర్వాత వచ్చిన మెగా హీరోలైన శిరీష్ ఒకటి, సాయి ధరమ్ తేజ్ రెండు చొప్పున రీమిక్స్ చేశారు. బన్నీ మిక్స్ చేయలేదు కానీ ఇద్దరమ్మాయిల తో సినిమాలో స్టెప్పు లేశాడు. అంతా బాగానే వుంది కానీ చిరు, పవన్ మాకు రెండు కళ్ళు లాంటి వారు అని చెప్పే ఈ మెగా హీరోలు ఎందుకో గానీ పవర్ రీమిక్స్ లు ఇంతవరకూ చేయనే లేదు. తొలిప్రేమ రీమిక్స్ లో నితిన్ ఇరగదీసి నా అది లెక్క లోకి రాదు. పవన్ పుట్టిన రోజు సందర్భం గా అలాంటి ప్రయత్నం ఏమైనా చేసి బయటికి వదిలుంటే.. అభిమానులు ఎంత ఖుషీ గా స్టెప్పులేసే వారో.. అందులోనూ పవన్ టైటిల్ సాంగ్స్ అయితే అంతర్లీనం గా మెసేజ్ తో బలే క్యాచీగా వుంటాయి. ఒక్క సారి మెగా యువ హీరోలు ఆ పాటేస్కో వాలే గానీ... ఆ కిక్కే వేరబ్బా..!