Begin typing your search above and press return to search.
మెగా హీరోలు మెగా కేరింగ్ మొదలెట్టారట
By: Tupaki Desk | 13 March 2018 6:20 AM GMTమన ఇండస్ట్రీ లో హీరోలకు వారసులుగా వచ్చిన వాళ్లంతా ఒక ఎత్తు అయితే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారు మరో ఎత్తు. మెగా హీరోలు అందరూ కలిసి చాలా తక్కువ సార్లే కనపడినా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వాటికి తప్పకుండా వెళ్తూ ఉంటారు. ఈమధ్యనే అందరూ ఒక చోట కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెడదాం అని నిర్ణయించుకున్నారంట.
మొన్నీమధ్యనే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పుట్టినరోజు నాడు జరిగిన పార్టీ లో కలిసిన మన మెగా హీరోలంతా ఒక ఆలోచన చేశారట. ఇందులో కొత్తగా మెగా హీరోల లిస్టులో చేరిన కళ్యాణ్ దేవ్ కూడా ఉండడం విశేషం. పేరుకి మెగా హీరోలు అయినా ఒక్కొకళ్ళకి ఒక్కో ఇమేజ్ ఉంది. అందులో బన్నీ వరుస హిట్లతో దూసుకుపోతుంటే, సాయి ధరమ్ తేజ్ - అల్లు శిరీష్ లాంటివాళ్ళు స్క్రిప్ట్ విషయంలో తేడా కొట్టడంవల్ల చేతులు కాల్చుకుంటున్నారు. అందుకే ఇకపై అలాంటివి జరగకుండా మెగా ఫ్యామిలీ నుండి మంచి మెగా హిట్లు అయ్యే సినిమాలు రావాలి అని అందరూ కలిసి కట్టుగా ఒక మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. అదేంటంటే.. ఉదాహరణకు బన్నీ వద్దకు ఒక మంచి కథ వచ్చింది కానీ తనకున్న మాస్ ఇమేజ్ వల్ల దానిని ఒప్పుకోవడం కుదరకపోతే ఆ కథను మరొక మెగా హీరో వద్దకు పంపుతాడు అన్నమాట.
అంతే కాదండోయ్.. ఒకవేళ సాయి ధరమ్ తేజ్ లేదా కళ్యాణ్ లకు ఒక స్క్రిప్ట్ వస్తే వాళ్లు దానిని మిగతా మెగా హీరోలకు కూడా చెప్పి వారినుండి సలహాలు సూచనలు తీసుకోబోతున్నారంట. ఇదంతా మెగా ఫ్యామిలీ నుండి మంచి సినిమాలు బయటకి రావాలి ఆమె ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం అన్నమాట. మరి చూద్దాం ఈ మెగా హీరోల ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో..