Begin typing your search above and press return to search.

నెలన్నరపాటు మెగా బాబులకే అంకితం

By:  Tupaki Desk   |   11 Sept 2015 8:35 PM IST
నెలన్నరపాటు మెగా బాబులకే అంకితం
X
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ సంబరాలు ఇంకా కంప్లీట్ కాలేదు. వారోత్సవాల రేంజ్ లో మెగాస్టార్ బర్త్ డేతో మొదలైన వేడుకలు.. అంబరాన్నంటాయి. మెగా వారసులందరూ టీజర్ లంటూ హంగామా చేశారు. ఆ తర్వాత పది రోజులకే పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చింది. ఈసారి పవన్ సహా మళ్లీ అందరూ టీజర్ లు, ట్రైలర్ లు వదిలారు. ఇప్పుడిప్పుడే ఆ స్పీడ్ తగ్గుతోందనగా.. మరోవారంలో అంటే సెప్టెంబర్ 17న.. వరుణ్ తేజ్ కంచె ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఫిక్స్ చేశారు.

ఇది కంప్లీట్ అయిన వారానికి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ థియేటర్ లను ఆక్యుపై చేసేయనున్నాడు సాయిధరం తేజ్. రెజీనా హీరోయిన్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి.. భారీ క్రేజ్ ఏర్పడింది. సుబ్రమణ్యం రిలీజ్ నుంచి పదో రోజున.. వరుణ్ తేజ్ కంచె వచ్చేస్తోంది. టీజర్ లాంఛింగ్ తోనే.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకూ సినిమా రాలేదంటూ.. పొగడ్తలు దక్కాయి డైరెక్టర్ క్రిష్ కి.

ఆ తర్వాత వారం రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా కనిపించనున్నాడు అల్లు అర్జున్. మరో వారం కల్లా బ్రూస్ లీగా రామ్ చరణ్ యాక్షన్ మొదలైపోతుంది. ఈ సినిమాలో చిరు కూడా చిందేసి.. ఈ మెగా సీజన్ కి సిసలైన ఫినిషింగ్ ఇవ్వబోతున్నారు. అంటే.. ఇంకో నెలన్నర టాలీవుడ్ అంతా మెగా నామ జపమే.