Begin typing your search above and press return to search.
ఫస్టాఫ్ ని మెగా టీమ్ రాయించేస్కున్నారు
By: Tupaki Desk | 1 Sep 2016 3:50 AM GMTమెగా ఫ్యామిలీ హీరోల్లో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లే నలుగురు హీరోలున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో ఉంటే.. ఆ నెక్ట్స్ రామ్ చరణ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు స్టార్ లీగ్ లో ఉంటారు. వీరంతా వరుసగా సినిమాలు రిలీజ్ చేసేస్తే ఆ మెగా హంగామా ఎలా ఉంటుంది? ఊహించుకోవడం ఎందుకని.. చేసి చూపించేస్తున్నారు మెగా టీమ్.
2017 సంక్రాంతికి మెగాస్టార్ 150వ సినిమా ఖైదీనెంబర్ 150 రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. సగానికి పైగా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. రిలీజ్ విషయంలో డౌట్స్ అక్కర్లేదని చెర్రీ చెప్పేయడంతో.. జనవరిని చిరంజీవికి రాసిచ్చేయచ్చన్న మాట. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో మూవీ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ లో చెర్రీ మూవీ షూటింగ్ మొదలై.. ఫిబ్రవరి లో రిలీజ్ అంటే బాగా స్పీడ్ చూపించనున్నారని అర్ధమవుతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడా(వర్కింగ్ టైటిల్)ని మార్చ్ 25కి రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ ముగ్గురు వచ్చే ఏడాది మొదటి మూడు నెలలను పంచేసుకుంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఏప్రిల్ నాదే అంటున్నాడు. గత మూడేళ్లుగా ఏప్రిల్ లో వచ్చి హిట్ కొట్టడం బన్నీకి అలవాటయిపోగా.. హరీష్ శంకర్ తో తీస్తున్న దువ్వాడ జగన్నాథంను ఏప్రిల్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇలా సమ్మర్ వరకూ మెగా టీమ్ ఆక్యుపై చేసేశారు. ఇక మే నెల కోసం సాయిధరం తేజ్ ట్రై చేస్తుంటే.. వీళ్లందరి కంటే ముందే ఈ ఏడాది డిసెంబర్ లోనే వరుణ్ తేజ్ మిస్టర్ రాబోతున్నాడు. వరుసగా నెలకో సినిమా లెక్కన మెగా సినిమాలు వచ్చేస్తాయన్న మాట.