Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీ వారణాసి సెంటిమెంట్
By: Tupaki Desk | 6 Dec 2017 4:32 AM GMTసాక్షాత్తు పరమ శివుడు కొలువైన కాశీ ఎంతో ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. కాశీలో గంగ స్నానం.. విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడం ఎంతో ఫుణ్యమని భక్తుల విశ్వాసం. కాశీకి వెళ్లొస్తే పుణ్యమే కాదు.. విజయమూ వరిస్తుంది. ఇది మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సెంటిమెంట్. కాశీ బ్యాక్ డ్రాప్ లో కథతో ఇంతవరకు ముగ్గురు మెగా హీరోలు సినిమాలు చేశారు.
మొదటిగా తెలుగు తెరపై కాశీ క్షేత్రాన్ని విస్తృతంగా చూపించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుంది. ఇంద్ర సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కాశీలోనే నడుస్తుంది. భంభం భోలే అంటూ వచ్చే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంద్ర సినిమా అప్పట్లో ఆల్ టైం రికార్డులు బద్దలుకొట్టింది. తరవాత కాశీ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నాయక్ సినిమా చేశాడు. కుంభమేళా నేపథ్యంగా ఇక్కడ ఇంటర్వెల్ ఫైట్ సీన్ తీశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశాడనే విషయం ఇక్కడే రివీల్ ఛేస్తారు. నాయక్ సినిమాకు కూడా మంచి ప్రేక్షకాదారణే దక్కించుకుంది. ఎటొచ్చీ ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే చిన్న లోటుండిపోయింది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో చేసిన పవన్ చేసి తీన్ మార్ సినిమా కాశీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు.
కాశీ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమాతో హిట్ కొట్టలేకపోయిన లోటు పవన్ కు ఇప్పుడు అజ్ఞాతవాసి తీర్చేలానే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాలో ఫైనల్ షెడ్యూల్ వారణాసిలోనే పూర్తి చేశారు. అజ్ఞాతవాసి హిట్ కొడితే మాత్రం మెగా ఫ్యామిలీకి వారణాసి కలిసొస్తుందని లెక్కేసుకోవచ్చు. చూద్దాం.. ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుటవుతుందో..