Begin typing your search above and press return to search.
ఆగస్టు 22.. మెగా డే.. 6 పండగలు!?
By: Tupaki Desk | 6 Aug 2015 2:11 PM GMTఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ప్రతియేటా అభిమానులు సేవా కార్యక్రమాలు, పూజలు పునస్కారాలు చేసుకునే రోజు ఇది. ఈ ఏడాది ఆగస్టులో అడుగుపెట్టేశాం. 22వ తేదీ దగ్గరికి వచ్చేస్తోంది. అయితే ఈసారి ఆగస్టు 22కి ఓ ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ పుట్టినరోజు వేడుక నిర్వహించే వేదికపైనే 150వ సినిమాని ప్రకటించనున్నారు. అంతేకాదండోయ్.. ఇదే వేదికపై ఏకంగా మెగా కుటుంబంలోని హీరోలంతా తమ సినిమాల్ని ప్రచారం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' టీజర్ లేదా పోస్టర్ ని ఈ వేడుకలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' టీజర్ ని, పోస్టర్ ని అదేరోజు రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అలాగే చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని ఇదే వేదికపై ప్రకటించే అవకాశం ఉంది. అంతేనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇదే వేడుకలో సర్ధార్ (గబ్బర్ సింగ్ 2) టైటిల్ ని ప్రకటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇకపోతే ఇదే వేదికపై బన్ని సినిమా టైటిల్ పోస్టర్, శిరీష్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా మెగా హీరోలంతా ఒకరితో ఒకరు పోటీపడి అన్నయ్య పుట్టినరోజుని పావనం చేయాలనుకుంటున్నారా? లేక తమ సినిమాల ప్రమోషన్ కి ఇదే సరైన వేదిక అని భావించి ఇలా చేస్తున్నారా? ఏమో.. ఆ రోజుని 'మెగా- డే'గా ప్రకటిస్తారేమో చూడాలి. మెగా కుటుబంలోని అరడజను హీరోలు ఒకే వేదికపైకి వస్తున్నారు కాబట్టి మెగా డేగా డిక్లేర్ చేయాల్సిందే.