Begin typing your search above and press return to search.
మెగా నాయిక.. సమ్మర్ టిప్స్..
By: Tupaki Desk | 14 April 2015 11:07 AM GMT త్రిధా చౌదరి .. టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన నవతరం కథానాయిక. వస్తూనే క్యూట్‌లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రెండో సినిమాకి సంతకం చేసింది. నిఖిల్ సరసన సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నటించిన ఈ భామ రెండో అవకాశం ప్రతిష్ఠాత్మక గీతాఆర్ట్స్‌లో చేజిక్కించుకుంది. అల్లు శిరీష్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకుంది. సోలో, యువత చిత్రాలతో విజయాలు అందుకున్న పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిధాని ఇటీవలే కలిసినప్పుడు కొన్ని సమ్మర్ టిప్స్ కూడా సూచించింది.
ఎండవేడినుంచి తట్టుకుని అందాన్ని కాపాడుకోవడానికి క్యూట్ గాళ్స్ ఆచరించదగ్గ ఆరు సూత్రాలు చెప్పింది. వేసవిలో బైటికి వెళ్లే ముందు నీళ్లు బాగా తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయలు తినాలి. కొబ్బరి బొండాలు తాగాలి. బొప్పాయి రసం, గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆయిల్ ఫ్రీ జెల్ బేస్డ్ సన్‌స్క్రీన్ లోషన్లు వాడాలి. ఎండలోకి వెళ్లే ముందు క్రీమ్ తప్పనిసరి. అలాగే వేసవిలో సౌకర్యవంతమైన లైనెన్ కాటన్ దుస్తులనే ధరించాలి. హెయిర్ స్టయిల్ విషయంలో జాగ్రత్త అవసరం. మెస్ ఫ్రీ స్టయిల్‌లో అయితే ఫ్రీగా ఉంటుంది. పాదాలు కందిపోకుండా షూ తప్పని సరి వాడాలి. అలాగే నేనైతే పెద్ద పెద్ద సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఎండలోకి వెళతాను. మీరూ అదే పాటిస్తే మంచిది.. అంటూ క్యూట్‌గా టిప్స్ చెప్పింది త్రిధా.