Begin typing your search above and press return to search.

థాంక్యూ బుట్ట బొమ్మ : మెగా హీరోల‌కు ల‌క్కీ గాళ్ .. ఈ క‌న్న‌డ సోయ‌గం..

By:  Tupaki Desk   |   28 April 2022 3:30 PM GMT
థాంక్యూ బుట్ట బొమ్మ : మెగా హీరోల‌కు ల‌క్కీ గాళ్ .. ఈ క‌న్న‌డ సోయ‌గం..
X
గోపిక‌మ్మ క‌న్నా బుట్ట‌బొమ్మ‌గానే బాగుంది. ర‌ఫ్ గా క‌నిపించ‌డం క‌న్నా సాఫ్ట్ గా క‌నిపిస్తేనే చాలా అంటే చాలా న‌చ్చుతోంది. అందుకే అర‌విందతో ప్రేమాయణం బాగుంది. నీలాంబ‌రితో ఆ వాలుక‌ళ్ల సోయ‌గంతో ప్రేమాయ‌ణం ఇంకా బాగుండ‌నుంది. అవును ! ఆమె మీకు న‌చ్చుతారు.. మ‌రో గ్రేడ్ పెంచి ఆలోచిస్తే ఆమెను మీరు ఆరాధిస్తారు.. అంత‌గా మంత్ర ముగ్ధుల‌ను చేస్తోందీ య‌వ్వ‌న‌వతి.. నీలాంబ‌రి ! ఆమె న‌వ్వుల‌కే ఫిదా మ‌రి! అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఫిదా అవుతూ ఇలా అందాం ఆమె అందం గురించి.. లేరెవ్వ‌రే నీలా మ‌రి ! నీలాంబ‌రి అని !

క‌న్న‌డ సోయగాల‌లో.. ఐశ్వ‌ర్య త‌రువాత అనుష్క ఆ త‌రువాత పూజా బేబీ ఎంతంటే అంత పేరు తెచ్చుకుని ద‌క్షిణాది పై త‌మ ప్ర‌భావాన్ని చూపించారు. తిరుగులేని విజ‌యాల‌ను ద‌క్కించుకుని తమ హ‌వా చాటిన ఈ కన్న‌డ సోయ‌గాల‌కు తెలుగు నాట మంచి అభిమానులు ఉన్నారు.వీరిని ఆరాధించే కోవ‌లో కొంద‌రు.. వీరి సినిమాలు వ‌స్తే కుటుంబ స‌మేతంగా చూసి వ‌చ్చే వారు కొంద‌రు.. ఏదేమ‌యినా ఆ ముగ్గురిలో పూజా బేబీ స‌మ్ థింగ్ స్పెష‌ల్. అందుకే త్వ‌ర‌లో మెగాస్టార్ తోనూ ఆడిపాడ‌డం ఖాయం అని నిన్న‌నో మొన్న‌నో తేలిపోయింది. ఆ వార్త విని ఈ బుట్ట బొమ్మ గాల్లో తేలిపోయింది. ద‌టీజ్ పూజ.. ద‌టీజ్ చిరు.. ద‌టీజ్ ఆచార్య

ప్ర‌తిభ ఉంటే అవ‌కాశాలు కానీ పూజాబేబీ అదృష్టంతో అవ‌కాశాలు కొల్ల‌గొడుతోంది ల‌క్కీ ఛార్మ్ అని అనిపించుకుంటోంది మెగా హీరోల‌తో జ‌త‌గ‌ట్టి మ‌రోసారి అల‌రించ‌నున్న నేప‌థ్యాన.. ఆమె గురించి ఇంకొంత.

అందాల బుట్ట బొమ్మ.. బ‌న్నీతో జోడి క‌ట్టింది. ఓ మామూలు క‌థే కానీ హిట్టు కొట్టింది. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ తో ఆట‌లు ఆడి, పాట‌లు పాడి ర‌చ్చ చేసింది. ఆ విధంగా బ‌న్నీ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. అటుపై అర‌వింద స‌మేత‌లో ర‌ఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు అని చెప్పి తార‌క్ అభిమానుల‌ను త‌న అభిమానులుగా మ‌లుచుకుంది. క‌న్న‌డ నాట నుంచి త‌ర‌లి వ‌చ్చిన సోయ‌గం సీమ క‌థ‌కు ఎంత‌గానో త‌న గ్లామ‌ర్ ను జోడించింది. ఆ విధంగా ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్ అనిపించుకుంది. అటుపై త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్లో అల వైకుంఠ పురంలో అంటూ సంద‌డి చేసింది. మ‌ళ్లీ అదే కాంబో రిపీట్ అయింది. ఈ సారి త్రివిక్ర‌మ్ ఆమెను మ‌రింత అందంగా చూపించారు. దీంతో ఆమె సినిమా జీవితానికి ఇక బ్రేకుల్లేకుండా పోయింది.

పూజాహెగ్డే.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..కెరియర్ మొదటిలోనే సక్సెస్ ను అందుకుంది. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరుగా బాగా ఫెమస్ అయ్యింది. కెరియ‌ర్ ఆరంభంలో 'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాలు నిరాశ పరిచినా..సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. హిట్ మీద హిట్టు కొట్టడంతో టాప్ గేర్ లో దూసుకుపోతుంది..ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు కోట్లకు పైగా తీసుకుంటూ వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.

'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఆమె సక్సెస్ జర్నీ మొదలవ్వగా.. ఆ తరువాత 'అరవింద సమేత', 'మహర్షి', 'అల.. వైకుంఠపురములో' ఇలా వరుస హిట్స్ అందుకుంది. గత నెలలో విడుదలైన 'రాధేశ్యామ్' సినిమా ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చినా, అవేవీ ఆమెకు ప‌ట్ట‌డం లేదు. ఆమె కెరియ‌ర్ ను ఫ్లాపులు ప్ర‌భావితం చేయ‌డం లేదు. అలానే చాలా కాలం తరువాత తమిళంలో 'బీస్ట్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా అమ్మడుకు హిట్ టాక్ ను అందించలేదు.

ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన 'ఆచార్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో తెలుగులో వచ్చిన బన్నీ మూవీ అల వైకుంఠపురంలో సినిమాలో కన్నా ఈ సినిమాలో హొమ్లీ లుక్ లో మోస్ట్ గ్లామ‌రస్ గా ప‌ద్ధ‌తి తెలిసిన తెలిసిన తెలుగింటి అమ్మాయిగా క‌నిపించ‌నుంది. ఆచార్య‌తో తెలుగులో తన స్టార్ డమ్ ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇదే స‌మయంలో బాలీవుడ్-లో వరుస సినిమాలు ఒప్పుకుంటోంది. రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోల సరసన ఆమె నటించబోతుంది. వీటితో పాటు తెలుగులో మహేశ్‌ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో త్వ‌ర‌లోనే త‌ళుకులీన‌నుంది కూడా !