Begin typing your search above and press return to search.
#SIIMA కళాతపస్వికి మెగా జీవితసాఫల్య పురస్కారం
By: Tupaki Desk | 20 Sep 2021 4:38 AM GMTSIIMA 2021 వేడుకలు హైదరాబాద్ నోవాటెల్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం రాత్రి అబ్బురపరిచాయి. టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్ ఇతర దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. సైమా -2019 అవార్డుల వివరాలు శనివారం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా సైమా- 2020 పురస్కారాల్ని అందజేసారు.
ప్రముఖ తెలుగు దర్శకుడు.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కి సైమా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం) లభించింది. కె.విశ్వనాథ్ `స్వయంకృషి`.. `ఆపద్భాంధవుడు`లో నటించిన చిరంజీవి.. స్వాతి కిరణం - స్వాతి ముత్యం.. చిత్రాలలో నటించిన సీనియర్ నటి రాధిక కళాతపస్వి విశ్వనాథ్ కి అవార్డును అందజేశారు. ప్రముఖ దర్శకుడు .. చిరు మధ్య ఉన్న బంధం చూడముచ్చటగా ఉంది. ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.
అవార్డుల్లో `అల వైకుంఠపురములో`వా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గురూజీ త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన `అల వైకుంఠపురములో` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందిరికి తెలిసిందే. సినిమా పరంగా ,.. మ్యూజిక్ పరంగా,.. నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా... సాంగ్స్ పరంగా ఈ మూవీ సృష్టించిన హంగామా.. రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అత్యంత ప్రజాదరణ పొందడమే కాకుండా పాటల ద్వారా పలు రికార్డుల్ని సెట్ చేసింది. అలాంటి ఈ మూవీ సైమా అవార్డుల్లో అగ్ర తాంబూలం దక్కింది. దక్షిణాది నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక అట్టహాసంగా సాగింది.
సైమా ఉత్తమ చిత్రంగా `అల వైకుంఠపురములో` అవార్డు గెలుచుకుంది. ఇదే సినిమాకి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా,. త్రివిక్రమ్ ఉత్తమ దర్శకుడిగా.. తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా..పూజా హెగ్డే ఉత్తమ నటిగా, ..మురళీశర్మ ఉత్తమ సహాయ నటుడిగా ,.. టబు ఉత్తమ సహాయ నటిగా,.. సముద్రఖని ఉత్తమ విలన్ గా,.. రామజోగయ్యశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా (బుట్టబొమ్మ),.. అర్మాన్ మాలిక్ ఉత్తమ గాయకుడి (బుట్టబొమ్మ)గా అవార్డు అందున్నారు.
సైమా 2020 అవార్డులు అందుకున్న మరికొంత మంది ..
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : సఉధీర్‌బాబు (వి)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : ఐశ్వర్యా రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)
ఉత్తమ హాస్య నటుడు : వెన్నెల కిషోర్ (భీష్మ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ పరిచయ నిర్మాణ సంస్థ : అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్ ఫొటో)
ఉత్తమ పరిచయ దర్శకుడు : కరుణ కుమార్ 9పలాస 1978)
ఉత్తమ పరిచయ నటుడు : శివ కందుకూరి (చూసీ చూడంగానే)
ఉత్తమ పరిచయ నటి : రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
ఉత్తమ గాయని : మధు ప్రియ (హీ ఈజ్ సో క్యూట్ : సరిలేరు నీకెవ్వరు)