Begin typing your search above and press return to search.
మెగా - నందమూరి రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్..!
By: Tupaki Desk | 26 Jan 2021 5:30 PM GMTదేశవ్యాప్తంగా నేడు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలను ఎప్పటిలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా ఫ్యామిలీ.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నందమూరి బాలకృష్ణ జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అరవింద్ - నాగబాబు - రామ్ చరణ్ లతో కలిసి బ్లడ్ బ్యాంకులో జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీమ్ తో పాటు మెగా అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారిని చిరంజీవి - చరణ్ లు పరామర్శించారు.
అలానే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన బాలయ్య.. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సేవాభావంతో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశామని.. కరోనా సమయంలో వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని తెలిపారు.
కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. మన దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు ఉపయోగపడటం గర్వకారణమని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని బాలకృష్ణ అన్నారు.