Begin typing your search above and press return to search.

మెగా నెగటివ్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

By:  Tupaki Desk   |   6 Feb 2022 6:34 AM GMT
మెగా నెగటివ్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ
X
మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. స్వల్ప లక్షణాలే ఉన్న కారణంగా ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి విశ్రాంతి తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వయసు ఆరు పదులను దాటి ఉంటుంది కనుక కరోనా కారణంగా ఆయన కాస్త ఎక్కువ రోజులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కాని సామాన్యులతో పోల్చితే ఇంకా త్వరగానే చిరంజీవి కరోనాను జయించారు. కరోనా నెగటివ్ రిపోర్ట్‌ వచ్చిందని మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. కేవలం నెగటివ్ అంటూ ప్రకటించడం మాత్రమే కాకుండా వెంటనే గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో జాయిన్ అయినట్లుగా కూడా ఫొటోలు షేర్‌ చేశారు.

మలయాళ సూపర్ హిట్‌ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా రూపొందుతున్న గాడ్‌ ఫాదర్ సినిమా షూటింగ్‌ లో చిరంజీవి జాయిన్ అయ్యారు. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతుంది. నయనతార ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవితో పాటు తాజా షూట్‌ లో సత్యదేవ్‌.. సునీల్‌ ఇంకా కీలక నటీ నటులు పాల్గొన్నారు. ఒరిజినల్‌ వర్షన్ లో వివేక్ ఒబేరాయ్ చేసిన పాత్రను ఈ సినిమా లో సత్యదేవ్‌ పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సునీల్‌ కూడా నటిస్తున్న నేపథ్యంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా ను జయించి ఏమాత్రం బ్రేక్ కాని.. విశ్రాంతి కాని తీసుకోకుండా చిరంజీవి షూటింగ్‌ లో జాయిన్ అవ్వడం పట్ల అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ను వచ్చే నెల వరకు పూర్తి చేసి భోళా శంకర్ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వాలని మెగాస్టార్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆచార్య సినిమా విడుదల అయిన కొంత గ్యాప్‌ లోనే గాడ్‌ ఫాదర్‌ ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనే కాకుండా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ లో కూడా వచ్చే నెల నుండి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరు ఒక సినిమాను కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ఇదే ఏడాది ప్రారంభించాల్సి ఉందట. మొత్తానికి చిరంజీవి ఏకకాలంలో నాలుగు అయిదు ప్రాజెక్ట్‌ లతో పాత చిరంజీవిని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా బ్యాక్‌ టు బ్యాక్ ఏడాదిన్నర కాలంలోనే రాబోతున్నాయట.