Begin typing your search above and press return to search.
దర్శక, రచయితలకు మెగా ఆఫర్!
By: Tupaki Desk | 16 Jan 2023 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతుంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్, కేథరిన్ లేడీ లీడ్స్ గా నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రవితేజ అప్ కమింగ్ రైటర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.
అదేంటంటే వారు చెప్పిన ఒక లైన్ పట్టుకుని ఎవరైనా మంచి కథ డెవలప్ చేసుకుని వస్తే తాము సినిమా చేస్తామని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తాను రవితేజ దొంగలుగా ఉంటామని, అసలు మేమిద్దరం ఎందుకు దొంగలు అయ్యాం అనేదానికి ఒక మంచి రీజన్ కావాలని... అలాగే మేము నిజంగా దొంగలం కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
మేము దొంగలుగా మారితేనే మాకు కావలసిన దొంగలు దొరుకుతారు అనే లాంటి ఏదైనా ఒక మంచి లాజిక్ ఉండాలని... మేము ఆ దొంగల్ని ఎందుకు పట్టుకోవాలంటే ఆ దొంగలు మా ఫ్యామిలీని ఏదో చేశారనే.. ఫ్లాష్ బ్యాక్ ఉండాలని ఆయన హింట్ ఇచ్చారు. వాళ్లు ఇక్కడ ఉన్నారని తెలిసి వాళ్లను పట్టుకోవడానికి నేను రవి వెళతామని ఇలాంటి లైన్ తో ఎవరైనా వస్తే సినిమా చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు.
దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న సదరు యాంకర్ ఇంకా అంతా కథ చెప్పేసారు కదా అంటే రష్ అవర్ లాంటి కథ కావాలని రవితేజ చెప్పుకొచ్చారు. అయితే నిజానికి మెగాస్టార్ చిరంజీవి రవితేజ ఇద్దరినీ ఒకే స్క్రీన్ లో చూపించి ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేయడంలో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ దాదాపుగా సఫలమయ్యాడు. వాల్తేరు వీరయ్య అనే సబ్జెక్టు రొటీన్ కథే అయినా మెగాస్టార్ చిరంజీవి రవితేజ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాంటిది వీరిద్దరూ కనుక ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టడం ఖాయం అనే చెప్పాలి.
మరి చిరంజీవి పిలుపు మేరకు ఎవరైనా దర్శక రచయితలు కథ రాసుకుని ముందుకు వెళతారు ఏమో చూడాలి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.